బాలీవుడ్ లో మరో ఛాన్స్‌ కొట్టేసిన రష్మిక!

Rashmika got another chance in Bollywood!
Spread the love

దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ వరుస చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు నటి రష్మిక గతేడాది ‘యానిమల్‌’తో విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో వరుస షూటింగ్స్‌తో గ్యాప్‌ లేకుండా గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్‌ ఓకే చేశారు. ’స్త్రీ’, ’బేడియా’, ’ముంజ్య’ క్రియేటర్స్‌ దీనిని తెరకెక్కించనున్నారు. విభిన్న కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ’థమా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ యూనివర్స్‌ ఒక ప్రేమ కథ కోరుకుంటుంది. దురదృష్టవశాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్నదని టీమ్‌ పేర్కొంది. ఆయుష్మాన్‌ ఖురానా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ’ముంజ్య’ దర్శకుడు ఆదిత్య సర్పోత్థార్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

Related posts

Leave a Comment