రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణతో ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. సునీల్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Ramcharan- Shankar Movie: రామ్‌చరణ్ – కియారాల పాటతో ప్రారంభం?
