(చిత్రం: రాజుగారి కోడిపులావ్, నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు. బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా, నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన, డైరెక్టర్ : శివ కోన, సంగీతం : ప్రవీణ్ మనిసినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు, ఎడిటర్ : బసవా- శివ కోన, సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు, వీఎఫ్ ఎక్స్ : విష్ణు పడిలోజు, సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్, రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన, పీఆర్ఓ : హరీష్, దినేష్, విడుదల: 04-08-2023)
శివ కోన స్వీయ దర్శకత్వంలో ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’ . ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన ఈ సినిమా వైవిద్యమైన చిత్రంగా ఎన్నో అంచనాల నడుమ ఆగస్ట్ 4న థియేటర్లో విడుదల అయింది. ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. ఫైనల్ ఏ సర్టిఫికెట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…
కథ: రాజుగారు(ప్రభాకర్) ఒక హోటల్ ను నడుపుతూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. దానికి రాజుగారి కోడిపులావ్ అనే పేరు పెట్టి పైకి ఎంతో సంతోషంగా ఉన్నా నిజాకి అతను సంతోషంగా ఉండడు. కారణం తనకు కొడుకు పుట్టలేదని, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తిగా ఉన్న సమయంలో అతను ఒక ప్రమాదానికి గురి అయి తన రెండు కాళ్లను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత కలిసిన కొంద మంది ఫ్రెండ్స్ ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అందులో డ్యాని(శివ కోన) క్యాండీ (ప్రాచి కెథర్) ఒక పెయిర్, అలాగే ఆకాంక్ష(నేహా దేష్ పాండే) బద్రి( కునాల్ కౌశిక్) భార్యభర్తలు. ఫారుఖ్(అభిలాష్ బండారి) ఈషా(రమ్య దినేష్) భార్యభర్తలు. క్యాండీ, ఆకాంక్ష, బ్రది, ఫారుఖ్ వీళ్లు కాలేజీ స్నేహితులు, ఈషా ఒక ఐటీ ఎంప్లయ్, ప్లానింగ్ ప్రకారం రోడ్డు ట్రిప్ కు వెళ్లిన ఈ మూడు జంటలు వీరి డెస్టినీ చేరుకునే లోపే కారు బ్రేక్ డౌన్ వలన అడవిలో నడవాల్సి వస్తుంద. అలా ప్రయాణం సాగిస్తున్న వీరిలో ముందు క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. అలాగే దారి తప్పిపోవడం వలన వారు అడవిలోనే తిరిగుతూ ఉంటారు. తరువాత ఆ గ్రూప్ లో ఈషా కనిపించకుండా పోతుంది. తనకు ఏమైందో తెలియదు. అలా తిరుగుతున్న వారు ఫైనల్ గా అడవిలో ఒక ఇంట్లోకి వెళ్తారు. ఇక అక్కడే అసలు ట్విస్ట్ మొదలౌతుంది. అసలు క్యాండికి ఏం అయింది.? డ్యానీ ఎవరు? వీరి కాలేజీ లైఫ్ లో ఏం జరిగింది.? ఫారుఖ్, ఆకాంక్షల నడుమ ఎలాంటి రిలేషన్ ఉంది.? అలసు రాజుగారికి ఈ ముగ్గురు జంటలకు సంబంధం ఏంటీ? వరుస హత్యలు ఎందుకు జరిగాయి.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ: ఫేమస్ రాజుగారి కోడిపులావ్ హోటల్ మీదుగా కథ ప్రారంభం అవుతుంది. ఆకాంక్ష, బద్రి భార్యభర్తలుగా ఉన్నా వారిలో అన్యోన్యత అంతగా ఉండదు. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇక గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. చూసే ప్రేక్షకుల్లో అక్కడి నుంచి ఏదో జరగబోతుంది అన్న ఉత్కంఠట ఏర్పడుతుంది. అనుకున్నట్లుగానే అక్కడ ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు కనిపిస్తాయి. అవి మరింత ఆసక్తిని పెంచుతాయి. ఇక ఫస్ట్ ఆఫ్ లోనే క్యాండీ మరణించడంతో డ్యానీ వింతగా ప్రవర్తిస్తాడు. మిగితా వారిదో తగువులు పెట్టుకుంటాడు. అక్కడ వచ్చే డైలాగ్స్ ఫన్నిగా ఉంటాయి. ఇక డ్యానీ కనిపించకపోవడంతో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. సెకండ్ వచ్చే సరికి అదే ఆసక్తి కంటిన్యూ అవుతుంది. నెక్ట్స్ ఏం జరుగుంది అనుకున్న సమయంలో ఫారుఖ్ చనిపోతాడు. ఆ తరువాత అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లిన తీరు మెప్పిస్తుంది. అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ చాలా ఆసక్తిగా ఉంటుంది. అసలు ఈ మొత్తం కనిఫ్యూజన్సు ముగింపు పలుకుతూ సెకండ్ ఆఫ్ ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పిరయన్స్ తో ఎండ్ అవుతుంది.
ఎవరెలా చేశారు: ముఖ్యంగా ఈ చిత్రం గురించి చెప్పాలంటే ముందు శివ కోన గురించి చెప్పాలి. తానే చివరి వరకు వన్ మ్యాన్ షోగా కనిపిస్తారు. యాక్టర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకొని చాలా కూల్ గా, చాలా ఈజ్ గా ఆ పాత్ర చేశారు. ముఖ్యంగా డ్యాని క్యారెక్టర్లో ఉన్న షెడ్స్ ను అద్భతంగా తెరపైన పండించారు. స్క్రీన్ మీద చాలా కూల్ గా కనిపిస్తూనే కామెడీ చాలా బాగా చేశాడు. అంతే బాగా తన క్యారెక్టర్ తో థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారు. ఇక తరువాత ప్రాచీ థాకర్ తన యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. తాను చేసిన యాక్టింగ్ ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఉంటుంది. అలాగే అభిలాష్ బండారి ఫారూఖ్ పాత్రలో చాలా హ్యండ్ సమ్ గా కనిపించారు. ఇక తన యాక్టింగ్ కూడా డిసెంట్ గా అనిపిస్తుంది. అలాగే నేహా దేష్ పాండే తన రోల్ కు పూర్తి న్యాయం చేసింది. ఆకాంక్ష పాత్ర కూడా రెండు కోణాలు ఉన్న పాత్ర కాబట్టి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర. అందులో నేహా జీవించేసింది. కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. తన ఫ్రెష్టన్ తో నవ్వు తెప్పిస్తుంది. ఇక ఫైనల్ గా ఈటీవి ప్రభాకర్ కనిపించిన కాసేపయిన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
సాంకేతిక అంశాలు: ముఖ్యంగా ఈ విభాగంలో డైరెక్టర్ శివ కోన వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. తనకు డెబ్యూ సినిమానే అయినా ఎక్కడా కూడా కొత్తవాడు దర్శకుడు అన్న ఫీలింగ్ రాదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా అద్భుతంగా తన పని తనాన్ని చూపించారు. ఫన్, థ్రిల్లింగ్ అంశాలను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సినిమా మెయిన్ ప్రాణం అయిన మ్యూజిక్. దీన్ని అందించిన ప్రవీన్ మణీ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఉత్కంఠబరితమైన సన్నివేశాల్లో తన చక్కని ప్రతిభను కనబరిచారు. అలాగే సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఇక యాక్టర్లు కొత్తవాళ్లైన చాలా అది తెలియకుండా అందంగా చూపించారు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకాస్త షార్ప్ కట్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే నిర్మాణ విలువల విషయాని వస్తే చాలా వరకు నేచురల్ గా చిత్రీకరించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏం కావాలో వాటిని చక్కగా తెర మీదు అవిష్కరించారు. మొత్తంగా ఈ సినిమా భలే పసందు ‘రాజుగారి కోడిపులావ్’ విందు! ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సినిమా థీమ్
కథనం
ఫ్లాష్ బ్యాక్ కొత్తగా ఉంటుంది.
హీరో బ్యాక్ స్టోరీ ఆసక్తిగా ఉంది
శివ కోన యాక్టింగ్
ట్విస్ట్ బాగున్నాయి.
రేటింగ్ : 3/5