ఎన్టీఆర్‌కు గాయాలంటూ ప్రచారం… క్షేమంగానే ఉన్నారంటూ స్పష్టీకరణ!

Propaganda that NTR is injured... Clarification that he is fine!
Spread the love

ప్రముఖ హీరో ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలయ్యాలంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై నటుడి టీమ్‌ స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ‘జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మకండి’ అని విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం చోటుచేసుకుందని, నటుడికి గాయాలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరగ్గా టీమ్‌ రియాక్ట్‌ అయింది.

Related posts

Leave a Comment