రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం. 1

Production No. 1 directed by writer Mohan and starring Vennela Kishore and Ananya Nagala in lead roles.
Spread the love

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సెట్ లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజ మహదాస్య హీరోగా, బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా, ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధానపాత్రలో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తన అందం అభినయంతో వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రంలో అవకాశాన్ని దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ప్లే బ్యాక్, మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకుంది ఈ అమ్మడు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె అప్ కమింగ్ సినిమా పోస్టర్లను విడుదల చేశారు.
ప్రస్తుతం అనన్య చేతులో భారీగా సినిమా ఆఫర్లు ఉన్నాయి. అందులో బహిష్కరణ, లేచింది మహిళా లోకం, అన్వేషీ, నవాబు, తంత్ర సినిమాలతో కలిపి మొత్తం 7 సినిమాల్లో హీరోయన్ గా నటిస్తుంది. అందులో ప్రొడక్షన్ నెం1 అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
నటీనటులు: అనన్య నగళ్ల, రవితేజ మహదాస్య, వెన్నెల కిషోర్, తదితరులు
బ్యానర్: గణపతి పిక్చర్స్
దర్శకుడు: రైటర్ మోహన్
నిర్మాత: వెన్నెపూస రమణారెడ్డి
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున
సంగీతం: సునీల్ కశ్యప్
ఎగ్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ : రాంబాల రాజేష్ ఎగ్జిక్యూటివ్
పీఆర్ఓ : హరీష్, దినేష్

Related posts

Leave a Comment