‘ఒక్క చూపుతో మెదలైన..’ చిత్రం ట్రైలర్ విడుదల

'OKKA CHUPUTHO MODHALAINA' movie Trailer Release
Spread the love

శివచౌదరి, జశ్విక హీరో హీరోయిన్లుగా చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో శ్రీ ఆంజనేయ క్రియేషన్స్ పతాకంపై పోలూరి బిందుసారధి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క చూపుతో మెదలైన..’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హీరో శ్రీకాంత్ , నటుడు శివాజీరాజా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ‘ఒక్క చూపుతో మెదలైన..’ ట్రైలర్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’‘ చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క చూపుతో మెదలైన..’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. పోలూరి బిందుసారధి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉండి అందరి మనసుల్ని గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా విజయం సాధించి ఈ సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ కు ఈ సందర్బంగా బెస్ట్ విషెష్ చెప్పారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న చిత్రాలను మనం గమనిస్తూనే ఉన్నాం. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. మంచి విజయాల్ని అందిస్తూ నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’లాగే ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకోవాలని అకక్నశించారు.
దర్శకుడు చెంచయ్య నూతలపాటి మాట్లాడుతూ ..” మంచి కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమా సాగుతుంది. నిర్మాత పోలూరి బిందుసారధి సినిమా చక్కగా రూపొందడానికి పూర్తి సహకారాన్ని అందించారు. ఎక్కడా రాజీ పడకుండా మాకు ఏం కావాలంటే అది వెంటనే సమకూర్చి సినిమా బాగా రావడానికి తోడ్పడ్డారు” అని చెప్పారు.
నిర్మాత పోలూరి బిందుసారధి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆటో కిషోర్, లింగం గూడు అందరికీ
ధన్యవాదాలు తెలిపారు.
శివచౌదరి, జశ్విక, డి.ఎస్. రావు, సత్యవర్మ, పటాస్ రాము, అమన్ సింగ్, సాయి రామకృష్ణ, చెంచయ్య, స్వరాజ్యం ప్రసన్నరాణి అంజలి, ఉషా, చిన్నీ, లక్ష్మీ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: అనం వెంకట్, ఎడిటర్: మహేంద్రనాథ్, సంగీత: చైతన్య రాజ, కో ‌-డైరెక్టర్ చందు, పి.ఆర్.ఓ : బాబునాయక్ (సినీసందడి, సినీలోకం), నిర్మాత పోలూరి బిందుసారధి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : చెంచయ్య నూతలపాటి,

Related posts