చిత్రం: ఓ..! సుకుమారి
విడుదల : జూలై 17, 2026
నటీనటులు : తిరు వీర్, ఐశ్వర్య రాజేష్,
మురళీధర్ గౌడ్, విష్ణు ఓయి (మ్యాడ్ ఫేమ్),
ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్ తదితరులు
సంగీతం: భరత్ మంచిరాజు
కళ: తిరుమల ఎం. తిరుపతి
సినిమాటోగ్రఫీ: సీహెచ్ కుషేందర్
ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్
పాటలు: పూర్ణాచారి
బ్యానర్ : గంగా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
రేటింగ్: 2.75/5
విభిన్నమైన కథాంశాలతో టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఏటా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ‘పాపం ప్రతాప్’ మూవీతో ప్రేక్షకులను అలరించిన తిరువీర్ ఇప్పుడు ‘ఓ.. సుకుమారి’తో వచ్చాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది ఐశ్వర్య రాజేష్ . ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత కొంత గ్యాప్ అనంతరం ‘ఓ సుకుమారితో’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విలక్షణమైన కథలను ఎంచుకునే తిరువీర్, వెర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రమిది. ‘ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు భరత్ దర్శన్. ‘శివం భాజే’ సినిమా తర్వాత గంగా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ‘ఓ సుకుమారి’ ఈ శుక్రవారం (జూలై 17, 2026) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథాబలమున్న సినిమాలతో ప్రయాణం చేసే తిరువీర్ కథానాయకుడు కాగా.. ప్రముఖ కథానాయిక ఐశ్వర్య రాజేష్ ఆయనతో జోడీ కట్టడం, ప్రచార చిత్రాలూ, సినిమాలోని కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని ప్రముఖంగా ఆకర్షించిన అంశాలు. మరి అసలు చిత్రం ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? మరి ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? ఆమెకు మరో హిట్టు దక్కిందా? ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? ట్రైలర్‌తో కాస్త ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం..
కథ: యాదగిరి (తిరువీర్) ఎలాగైనా ఊరికి సర్పంచ్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. యాదగిరికి తమ్ముడు (శ్రీనివాస్ గవిరెడ్డి)తో అస్సలు పడదు. వీరి తాత వీలునామా ప్రకారం… అన్నదమ్ముల్లో ఎవరికి ముందుగా మగ బిడ్డ పుడితే, వారికే ఆస్తి దక్కుతుంది. దీంతో ఇద్దరూ పెళ్లి కోసం పోటీ పడతారు. తమ్ముడు ముందే ఒక గర్భవతి అయిన అమ్మాయిని వివాహం చేసుకోగా, యాదగిరి కూడా పెళ్లి చూపుల్లో దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అయితే, దామినికి చిన్నప్పటి నుండి ఎవరిని ముట్టుకున్నా షాక్ కొట్టే ఒక వింత సమస్య ఉంటుంది. ఊరి జనం ఈ విషయాన్ని దాచిపెట్టి యాదగిరితో ఆమెకు పెళ్లి జరిపిస్తారు. శోభనం రాత్రి ఈ చేదు నిజం తెలిసిన యాదగిరి షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆస్తి ఎవరికి దక్కింది? ప్రాణంగా ప్రేమించిన దామినిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని యాదగిరి ఎందుకు చెప్పాడు? అసలు కరెంట్ షాక్ సమస్య దామినికి ఎందుకొచ్చింది? తన మంచితనంతో యాదగిరి కుటుంబసభ్యుల్లో దామిని ఎలా మార్పు తెచ్చింది? చివరకు దామిని సమస్యకు పరిష్కారం దొరికిందా? దామిని గొప్ప మనసును చంద్లాపూర్ ప్రజలు అర్థం చేసుకున్నారా? చివరకు యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఓ..! సుకుమారి’ కథ.
విశ్లేషణ: హీరోయిన్‌కు ముట్టుకుంటే కరెంట్ షాక్ తగలడం, అది తెలియకుండా హీరో పెళ్లి చేసుకోవడం వరకు దర్శకుడు సినిమాను బాగానే నడిపించాడు. అసలైన కథలోకి ఎంటరయ్యే టైమ్‌లో ట్రాక్ తప్పాడు. ఎలెక్షన్స్ , ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు అంటూ ఏటో వెళ్లిపోయాడు. అసలు స్క్రీన్‌పై ఏం జరుగుతుందో, ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు. హీరోయిన్ను కాదన్న హీరో తల్లి చెప్పిన ఒక్క మాటకే మారిపోవడం, హీరో ఓ డైలాగ్ చెప్పగానే హీరోయిన్‌కు ఉన్న సమస్య తొలగిపోవడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. హీరో ఫ్యామిలీ మారిపోయే సన్నివేశాలు ఫోర్స్డ్గా ఉన్నాయి. దామినికి సమస్య రావడం వెనుక ఏదో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లుగా చివరి వరకు దాచిపెట్టారు. రివీలయ్యే ఫ్లాష్‌బ్యాక్ సిల్లీగా అనిపిస్తుంది. నాయకానాయికల కెమిస్ట్రీ అయినా సరిగ్గా చూపించలేకపోయారు.
తెలంగాణ నేపథ్యం ‘ఓ సుకుమారి’కి పెద్దగా ప్లస్సవ్వలేదు. డైలాగ్స్‌లో సహజత్వం లోపించింది. రిపీటెడ్ సీన్లు, ఎమోషన్లతో ఆడియెన్స్ ఓపికకు ఓ పరీక్షలా ఈ సినిమా ఉంటుంది. పాయింట్‌లెస్‌గా సాగే ఈ సినిమాను తమ నటనతో నిలబెట్టడానికి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ చాలానే ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు దర్శకుడు భరత్ దర్శన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారనిపిస్తుంది. ఒక వింత శారీరక సమస్య ఉన్న అమ్మాయి చుట్టూ కథను అల్లుకోవడం అనేది వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ దాన్ని తెరపై ప్రదర్శించడంలో బలమైన ఎమోషన్‌ను పండించలేకపోయాడు. అయితే.. తెలంగాణ యాసలో సాగే వన్-లైనర్ కామెడీ సీన్లు, కొన్ని వినోదాత్మక సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్‌కు కొన్నిసార్లు షాక్ కొట్టడం, కొన్నిసార్లు కొట్టకపోవడం వెనుక ఉన్న లాజిక్‌ను దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దీనివల్ల ప్రేక్షకుడు కథతో పూర్తిగా కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతుంది. తిరువీర్ ఇటీవల నటించిన ‘పాపం ప్రతాప్’లో కథానాయకుడి పాత్రకు సమస్య ఉంటుంది. అది కూడా భార్యాభర్తల మధ్య కాపురానికి సవాల్‌గా నిలిచిన సమస్యే. ఇందులోనేమో కథానాయికకి సమస్య. ఈ రెండూ కూడా గ్రామీణ నేపథ్యంతో సాగే కథలే. మరికొన్ని సారూప్యతలూ కనిపిస్తాయి. ముట్టుకోగానే షాక్ కొట్టే ఓ అమ్మాయి… అది తెలియక ఆమెని పెళ్లి చేసుకున్న ఓ అబ్బాయి… ఆ ఇద్దరి మధ్య కలిసి కాపురం ఎలా సాగించారన్నది ఆసక్తిని రేకెత్తించే విషయమే. నాయకానాయికలు, నిర్మాతలు వినగానే సినిమా చేయడానికి ఒప్పుకొనేలా ప్రేరేపించే కథాంశమే ఇది. అయితే ఇలాంటి కథల్ని పక్కాగా తెరపై ఆవిష్కరించడంలోనే చాలా సవాళ్లు ఉంటాయి. కథలోని సమస్యతో ప్రేక్షకుడు కనెక్ట్ అయినా కావాలి, లేదంటే తెరపై ఆ సమస్య అందరినీ ఆశ్చర్యపరిచేలా అయినా ఉండాలి. కానీ, ఇందులో కథానాయికకి ఉన్న సమస్య ప్రపంచంలోనే ఒకరిద్దరికి మాత్రమే ఉన్న అరుదైనదని చెప్పారు. అలాంటప్పుడు ఆ సమస్యతో అంతగా కనెక్ట్ కాలేము. పోనీ, అరుదైన సమస్య కదాని సీరియస్‌గా ఏమైనా దాని గురించి చర్చించారా? అంటే అదీ లేదు. షాక్ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పారు కానీ, చివరిలో ఎందుకు రాదో చెప్పలేదు. సినిమా అంతా ఆ సమస్య చుట్టూనే తిరిగినప్పుడు, దానికి ముగింపు లాజికల్‌గా ఉండాలి. కానీ, ఇందులో అదే లేదు. కామెడీ కోసం ప్రతి పాత్ర ప్రయత్నిస్తుంటుంది కానీ.. ఒకట్రెండు చోట్ల తప్ప నవ్వులు పండవు. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచే అసలు సందడి మొదలవుతుంది. పెళ్లి చూపులు, ప్రీవెడ్డింగ్ షూట్, విరామానికి ముందు సన్నివేశాలూ అక్కడక్కడా హాస్యం పంచుతాయి. ద్వితీయార్ధం రొటీన్‌గా పాత కథల్ని గుర్తు చేస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం చుట్టూనే దాదాపు సన్నివేశాల్ని మలిచారు. వాటిలో కొత్తదనం, భావోద్వేగ కోణం పెద్దగా కనిపించదు. కాన్సెప్ట్‌లో ఒకింత మెరుపు కనిపించినా.. రచనలో బలం లేదు. ఒక చిన్నారి చిన్నప్పుడే జరిగిన ఒక అనుకోని ప్రమాదంతో, ముట్టుకుంటే షాక్ కలిగేలాంటి ఒక వింత సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆ చిన్నారి పెరిగి పెద్దయ్యాక ఆమె వల్ల ఊరి జనం ఎలా ఇబ్బందులు పడ్డారు అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఇది కథగా చెప్పుకోవడానికి బాగుంది కానీ, స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కొంత తడబడినట్లు అనిపిస్తుంది. తెలంగాణ యాసలో కొన్ని వన్-లైనర్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ, ఫుల్-ఫ్లెడ్జ్‌డ్‌గా సినిమా చూస్తున్నప్పుడు ఎందుకో పూర్తిస్థాయిలో కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ అవుతున్న ఫీలింగ్ కలగదు. నిజానికి సినిమా లైన్ గా చూసుకున్నప్పుడు బానే ఉంది కానీ, ఆ ఎమోషన్స్‌ను స్క్రీన్ మీదకు తీసుకురావడంలో ఎక్కడో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ముట్టుకుంటే షాక్ కొట్టడం అనే కాన్సెప్ట్ ఉన్నా… కొన్నిసార్లు ముట్టుకుంటే షాక్ కొట్టడం, కొన్నిసార్లు షాక్ కొట్టకపోవడం ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని సరిగ్గా రిజిస్టర్ చేయడంలో ఇబ్బంది పడినట్లే అనిపిస్తుంది. నిజానికి దామిని ఎప్పుడు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఎప్పుడు షాక్ కొట్టదు అనే విషయాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలా రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది. సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్.. సులభంగా ఊహించగలిగే కథనం. సినిమాలోని అసలు ట్విస్ట్‌ను ప్రమోషన్స్‌లోనే రివీల్ చేయడం వల్ల, ఆ తర్వాత ఆసక్తికరమైన సన్నివేశాలతో మెప్పించాల్సిన బాధ్యత దర్శకుడిపై పడింది. కానీ భరత్ దర్శన్ ఆ విషయంలో బాగా తడబడ్డారు. ఫస్టాఫ్‌లో పాతకాలపు కామెడీనే నమ్ముకున్నారు. కొన్ని సన్నివేశాలు మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక, మంచి ఎమోషనల్ డ్రామా పండే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు రొటీన్ దారిలోనే వెళ్లారు. దీంతో సెకండాఫ్ బాగా సాగదీసినట్లు, ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగుతుంది. ప్రధాన పాత్రల్లో నటించిన ఐశ్వర్య రాజేష్, తిరువీర్ల క్యారెక్టరైజేషన్స్‌లో కూడా లోతు లేదు. వారు ఎంత బాగా నటించినా, ఆ పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అలాగే, ఐశ్వర్య రాజేష్ మాటిమాటికీ వాడే ‘ఉచ్చు’ అనే పదం ఒక దశ దాటాక చిరాకు తెప్పిస్తుంది. ఆమని, ఆనంద్ లాంటి సీనియర్ నటులకు మంచి స్కోప్ ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు. ఫ్యామిలీ డ్రామాలో కూడా ఎమోషన్ మిస్ అవ్వడంతో కథతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. సినిమాకు కామెడీయే ప్రధాన బలం అనుకుంటే.. అది కూడా వర్కవుట్ కాలేదు. కొన్ని జోకులు మినహా చాలా చోట్ల నవ్వు రాదు. నటీనటులు కూడా సహజంగా కాకుండా, కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: ఇటీవల వరుసగా మంచి పాత్రలతో మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేష్, ఈ సినిమాలోనూ తనదైన మార్క్ చూపించారు. సినిమా ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ‘ఓ సుకుమారి’ చిత్రానికి కి ఐశ్వర్య రాజేష్ వన్ ఉమెన్ షోగానే నిలిచింది. దామిని పాత్రలో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నింటిని సమపాళ్లలో పండించింది. తన వరకు బాగా చేసింది. యాదగిరిగా తిరువీర్ నాచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక యాదగిరి క్యారెక్టర్లో తిరువీర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ముఖ్యంగా అసలు నిజం ఏంటో తెలిశాక, ఐశ్వర్యతో ఆయనకు ఉండే సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో వచ్చే ఇలాంటి కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌కు మంచి రిలీఫ్ ఇస్తాయి. భార్య కారణంగా ఇబ్బందులు పడే భర్తగా అతడిపై వచ్చే కొన్ని ఫన్ సీన్స్ బాగున్నాయి. ఝాన్సీ, మురళీధర్ గౌడ్ కామెడీ ట్రాక్ నవ్వించకపోగా చిరాకును తెప్పించింది. అంజిమామ మగధీర డైలాగ్స్ రిలీఫ్నిచ్చాయి. రూపలక్ష్మి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి, జీవన్‌తో పాటు చాలా మందే యాక్టర్లు ఈ సినిమాలో కనిపిస్తారు. దర్శకుడి రాతలోని లోపాల కారణంగా ఏ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.
నటీనటుల ప్రతిభ: అమాయకపు పల్లెటూరి యువకుడిగా హీరో తిరువీర్ తన నటనతో యాదగిరి పాత్రలో మరోసారి అదరగొట్టాడు. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలో సహజమైన నటన మెప్పిస్తుంది, చాలా సన్నివేశాలకు బలం చేకూర్చింది. తన పాత్రలో చాలా ఈజ్‌తో నటించి మెప్పించాడు. తిరువీర్ మరోసారి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. చాలా ఈజ్‌తో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపించింది. భార్యా బాధితుడైన భర్త పాత్రలో మరోసారి తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ గతంలో చేసిన తెలుగు సినిమాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైన పాత్ర. నటనకు ప్రాధాన్యమున్న ఈ వింత పాత్రలో ఆమె జీవించేసింది. యాక్ట్ చేసే స్కోప్ దొరికిన ఈ పాత్రలో ఆమె అదరగొట్టింది. ఇక ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: ఒక ఆసక్తికరమైన పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు భరత్ దర్శన్, దాన్ని పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా మలచలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పాటలు సినిమాకి అడ్డుగా అనిపించలేదు, ఫ్లోలో వెళ్లిపోయాయి.. బాగున్నాయి. ఇక కుశేందర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి అదనపు బలాన్నిచ్చింది భరత్ మంచిరాజు మ్యూజిక్ సూపర్. సంగీతానికి సరిపడా కథ, సీన్లు లేకపోవడంతో అతడి శ్రమ వృథాగానే మారింది. బలహీనమైన రైటింగ్, అవుట్‌డేటెడ్ నేరేషన్ సినిమాకు పెద్ద డ్రా బ్యాక్. భరత్ మంచిరాజు సంగీతం కొన్ని చోట్ల ఓకే అనిపించినా, గుర్తుండిపోయేలా లేదు. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా డీసెంట్‌గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే… ‘ఓ..! సుకుమారి’ కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకున్నా, ఎగ్జిక్యూషన్లో తడబడిన రొటీన్ కామెడీ డ్రామా. లీడ్ పెయిర్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ నటనతో సినిమాకు కొంతవరకు బలాన్నిచ్చారు. అయితే, రొటీన్ కథనం, ఫ్లాట్‌గా సాగే సెకండాఫ్ వల్ల ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. భరత్ మంచీరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలు కథా గమనంలో భాగంగా సాగిపోతాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించాయి. మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
