పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలోనూ ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది. పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. “లైగర్” లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కి, “స్కంద” లాంటి ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేనికి యాసిడ్ టెస్ట్ లాంటి సినిమా “డబుల్ ఇస్మార్ట్”. పూరీ & రామ్ కాంబినేషన్ లో వచ్చి “ఇస్మార్ట్ శంకర్”కు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా మణిశర్మ బాణీలు, కావ్య థాపర్ గ్లామర్ షో జనాల్లోకి భీభత్సంగా వెళ్లిపోయింది. సో, శంకర్ క్యారెక్టర్ ఆల్రెడీ మాస్ ఆడియన్స్ లో బాగా రిజిస్టర్డ్ కాబట్టి, సినిమా ఏమాత్రం బాగున్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” ని అయితే మేకర్స్ ఈ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా (ఆగస్టు 15, 2024) విడుదల చేశారు. మరి సినిమా ఆ స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: మరో మూడు నెలల్లో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చనిపోతానని తెలుసుకున్న బిగ్ బుల్ (సంజయ్ దత్) బ్రెయిన్ ట్రాన్స్ఫర్ ద్వారా కలకాలం బ్రతికి ఉండాలని చేసే ప్రయత్నంలో.. ఆల్రెడీ హైద్రాబాద్ లో బ్రెయిన్ లో యు.ఎస్.బి పోర్ట్ పెట్టుకొని బ్రతుకుతున్న ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలుసుకొంటాడు. తన బ్రెయిన్ ను శంకర్ బుర్రలోకి ట్రాన్స్ఫర్ చేసి తన భవిష్యత్ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? శంకర్ ని బిగ్ బుల్ ఏం చేస్తాడు? బిగ్ బుల్ వల్ల శంకర్ జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే…
విశ్లేషణ: దర్శకుడు పూరి జగన్నాథ్ విషయానికి వస్తే.. తను ఈ సినిమాకి ఒక డల్ వర్క్ అందించారు అని చెప్పక తప్పదు. తన మార్క్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ బాగా మిస్ అయ్యాయి. కథనం కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి సాగలేదు. దీనికంటే పార్ట్ 1 కి పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వర్గాల్లో కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. అయితే.. ‘డబుల్ ఇస్మార్ట్’ మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు అందరినీ మెప్పించే విధంగా సాగింది. కచ్చితంగా పూరీ జగన్నాథ్, రామ్…లు స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సంజయ్ దత్ , రామ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ గమ్మత్తుగా, అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి. . మైండ్ గేమ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విశేషంగా ఆకట్టుకుట్టుంది. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ సెట్ చేసిందో అందరికీ తెలుసు.. సో దానికి సీక్వెల్ అంటే మినిమం అంచనాలు పెట్టుకొనే వెళ్తారు ప్రేక్షకులు. కానీ ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యే లెవెల్లో లేదని చెప్పక తప్పదు. ఈసారి పూరీ జగన్నాథ్ ఏదో ట్రై చేశారు కానీ తన వర్క్ డిజప్పాయింట్ చేస్తుంది. ఫోర్సెడ్ ఎమోషన్స్ ఆకట్టుకోని కథనం సినిమాని చప్పగా మార్చాయి. ఎక్కడో కొన్ని సీన్స్ తప్పితే అసలు సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. మొదటి సగమే ఏదో ఓకే అనిపించే రేంజ్ లో అనిపిస్తే మలిసగం పరిస్థితి కూడా ఇదే రీతిలో కొనసాగుతుంది. మెయిన్ గా పూరి మార్క్ మాస్ సీన్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో లేవు. వీటిని ఆశించే వారు మరింత డిజప్పాయింట్ అవుతారు. ఇక సంజయ్ దత్ రోల్ ఇంకా పెద్ద డిజప్పాయింటింగ్ అని చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి తను చేసే పనులు నటన అంత ఇంట్రెస్ట్ గా ఏమి కనిపించవు. అలాగే సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు.. అలాగే పూరీ ఆలీ కామెడీ ట్రాక్ అంటే కొన్ని అంచనాలు ఉంటాయి కానీ ఈ సినిమాలో ట్రాక్ పెద్దగా నవ్వు కూడా తెప్పించదు. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా మరింత బాగా డిజైన్ చేయాల్సింది. ఒక పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా గ్యాప్ వచ్చింది. రామ్ ఎనర్జీ, కావ్య థాపర్ అందాలు, మణిశర్మ బాణీలు కలగలిసి “డబుల్ ఇస్మార్ట్”తో ఆ గ్యాప్ ను ఫిల్ చేసాయనే చెప్పాలి. పూరీ రేంజ్ సినిమా కాకపోయినా.. ఆయన మునుపటి సినిమాతో పోల్చి చూస్తే చాలా బెటర్. సో, మాస్ ఆడియన్స్ కుర్రాళ్ళకి ఈ “డబుల్ ఇస్మార్ట్” బానే ఎక్కేస్తుంది.
నటీనటుల పనితీరు: రామ్ మరోసారి తన మాస్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పాలి. తన లుక్స్ పక్కా తెలంగాణ యాసలో గత ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే ఈసారి కూడా తన స్వాగ్ చూపించాడు. అలాగే మరో షేడ్ లో కూడా తనలో వేరియేషన్ ని చూపించాడు. “ఇస్మార్ట్ శంకర్” అలియాస్ డబుల్ ఇస్మార్ట్ గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ ప్రతిధ్వనిస్తుంది. ఇక డ్యాన్స్ & ఫైట్స్ తో అయితే మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు. రామ్ లోని ఎనర్జీ వెండితెరపై పొంగిపొర్లి ఆడియన్స్ మీదకు ఎగబాకిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ కావ్య థాపర్ కూడా తన రోల్ లో ఫిట్ అయ్యింది. రామ్ తో కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియెన్స్ కి నచ్చుతుంది. అలాగే ఫైట్స్ కూడా బాగా చేసింది.. కావ్య థాపర్ గ్లామర్ డోస్ బాగా యాడ్ చేసింది. డ్యాన్సుల విషయంలోనూ రామ్ ఈజ్ ను మ్యాచ్ చేసింది. ఇన్నాళ్ల కెరీర్లో ఆమెకు బహుశా ఇదే మంచి హిట్ అని చెప్పాలి. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్ లో స్టైలిష్ డాన్ గా కనిపించారు. ఇంకా సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ కొన్ని మాస్ మూమెంట్స్ బాగున్నాయి. సంజయ్ దత్ కి ఇది రెండో తెలుగు సినిమా, ఇదివరకు “చంద్రలేఖ” అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సంజు బాబా.. ఈ సినిమాలో బిగ్ బుల్ గా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. ఒంటరి తల్లి పాత్రలో నిడివి చిన్నదే అయినా నటి ఝాన్సీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. గెటప్ శ్రీను, బాని, టెంపర్ వంశీ , సయాజీ షిండే తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే అందులో సాగాన్ని కూడా రీచ్ కాలేకపోయింది అని చెప్పొచ్చు. రామ్ తన రోల్ ని బాగానే చేసేసాడు. కావ్య కూడా బాగానే కనిపించింది కానీ పూరి వర్క్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే రేంజ్ లో లేదు. పార్ట్ 1 చూసి దీనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే తప్పకుండా డిజప్పాయింట్ అవుతారు. ఎంత తక్కువ అంచనాలు పెట్టుకొని చూసినా ఇది కాదు కదా పూరి సినిమా అనే భావన తన అభిమానుల్లో కలుగుతుంది. వీటితో సినిమా బిలో యావరేజ్ గానే మిగిలిపోయింది. అయితే.. అలీతో ఆ జుమాంజీ కామెడీ ట్రాక్ ఎందుకు ఇరికించాడు అనేది ఆయనకే తెలియాలి. సదరు ఎపిసోడ్స్ కానీ అలీ సెన్సార్ కు దొరక్కుండా మాట్లాడే బూతులు కానీ అత్యంత హేయంగా ఉన్నాయి. అలీ తెరపై చేసే కొన్ని చేష్టలు చూస్తే ఇది నిజంగానే పూరీ జగన్నాథ్ తీసాడా అనిపిస్తుంది. అలీ ఎపిసోడ్ ను తీసేస్తే.. “డబుల్ ఇస్మార్ట్” మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ ఈ సినిమాకి సెకండ్ హీరో. డబుల్ ఇంపాక్ట్ మ్యూజిక్ తో అలరించాడు. ప్రతి ఒక్క పాట ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా మార్ ముంత చోడ్ చింతా పాటకు థియేటర్ టాపు లేచిపోద్ది. అలాగే.. నేపథ్య సంగీతం కూడా బాగుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మాత్రం పూరీ కెరీర్లోనే చీపెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే.. తనదైన శైలి డైలాగులతో మాత్రం ఎప్పట్లానే మ్యాజిక్ చేశాడు. సింపుల్ కాన్సెప్ట్ ను మరీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా.. మదర్ సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకోని పక్కా కమర్షియల్ సినిమాను అందించాడు పూరీ. ఈ సినిమాలో ఛార్మి, పూరి జగన్నాథ్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్, కావాల్సిన సెట్టింగ్ వర్క్స్ బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో మణిశర్మ వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ స్కోర్ బాగుంది కానీ కొన్ని సీన్స్ లో మిస్ అయ్యింది. రాజ్ తోట ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
(చిత్రం: ‘డబుల్ ఇస్మార్ట్’ , విడుదల తేదీ : ఆగస్టు 15, 2024, రేటింగ్: 2.75/5, నటీనటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్ , సాయాజీ షిండే, బని జె, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, ఝాన్సీ, ప్రగతి, ఆలీ, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : పూరి జగన్నాధ్, నిర్మాతలు : పూరి కనెక్ట్స్, ఛార్మీ కౌర్-పూరి జగన్నాధ్ , సంగీతం : మణి శర్మ , సినిమాటోగ్రఫీ :శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్ : జునైద్)