అందాలతార హాట్ బేబీ నిధి అగర్వాల్ సినిమాల స్పీడు పెంచడమే కాదు.. దాంతో పాటు తన రెమ్యూనరేషన్‌కూడా భారీగానే పెంచేసిందట. ఆకట్టుకునే నటన, గ్లామర్‌తో యువతరాన్ని కట్టిపడేస్తున్న ఈబ్యూటీ ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నిధి అందచందాలకు మాత్రం మంచి ప్రశంసలే లభించాయి. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ఇస్మార్ట్ శంకర్’తో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది. ఈ భామ తెలుగులో తాజాగా నటించిన చిత్రం ‘హీరో’. యంగ్ హీరో అశోక్ గల్లాతో జోడీ కట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసిందట. ఇప్పటివరకు రూ.50 నుంచి 80 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న నిధి ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్నర తీసుకున్నట్లు సమాచారం. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమాకు ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారిఅట! బాప్..రే నిధి!!
Nidhi Agerwal: నిధి అగర్వాల్ రెమ్యూనరేషన్ పెంచేసింది!?
