అగ్ర కథానాయిక నయనతార జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ సిద్ధమైంది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ దీనిని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు విశేషాలను ఓటీటీ సంస్థ ప్రకటించింది. ’నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు నయనతార. కాలేజీ రోజుల్లో ఆమె పార్ట్‌టైమ్ మోడల్‌గా వర్క్ చేశారు. ఓ సందర్భంలో ఆమెను చూసిన దర్శకుడు సత్యన్ అంతికాడ్.. ’మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో పరిశ్రమలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా ఎన్నో అవమానాలు, ఎత్తుపల్లాలు చూశారు. ’నేను రౌడినే’ సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ మొదలైంది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నయన్ – విఘ్నేశ్ పెద్దల అంగీకారంతో 2022లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నయనతార చిన్నప్పటినుంచి పెళ్లివరకూ సాగే ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ప్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం దీని ప్రోమో విడుదల చేశారు. నయన గొప్ప నటి మాత్రమే కాదని.. మంచి మనసున్న వ్యక్తి అందులో విఘ్నేశ్ తెలిపారు.
Related posts
-
ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్
Spread the love పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా... -
ఆ డైరెక్టర్‌తో చిరంజీవి మెగా ప్రాజెక్టు!?
Spread the love ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన వశిష్టకు, తన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సినిమానే... -
వర్మ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు
Spread the love ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో...