యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ‘నేనెవరు’ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 2, 2022)న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం!!
కథ: క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరూ గొడవపడి విడిపోతారు. చిత్రాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన క్రిష్… వున్నట్టుండి చిత్రకి దూరం కావడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అయితే అదే సమయంలో తన మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్)… జీకే (బాహుబలి ప్రభాకర్), తన మేనత్త అనుచరుడు నాయుడు వరుసగా హత్యలకు గురవుతారు. మరోవైపు క్రిష్ మాత్రం తన ప్రేయసిని తలచుకుంటూ… తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ… కనిపించిన వారికి అంతా తన లవ్ స్టోరీ చెబుతూ తిరిగేస్తూ వుంటాడు. మరి తన జీవితం నుంచి వెళ్లిపోయిన చిత్ర మళ్ళీ వచ్చిందా? ఆ వరుస హత్యలకు కారణం ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!!
కథ… కథనం విశ్లేషణ: ప్రేమతో ముడిపడిన క్రైం థ్రిల్లర్ లను ఇష్టపడే సినీ ప్రేమికులు చాలా మంది వున్నారు. అందుకే అలాంటి కథలని ఎన్నికోణాల్లో ఆవిష్కరించినా కొత్తగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే గ్రిప్పింగ్ కథ… కథనాలతో లవ్, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికడిగా, తాగుబోతుగా చూపించి… ఆ తరువాత… మర్డర్ మిస్టరీని ఛేదించిన విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను కట్టి పడేస్థాయి. దర్శకుడు రొటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా… ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించడంలో విజయం సాధించారు.
హీరోగా నటించిన కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగా… రివెంజ్ డ్రామా లో … మాస్ ను మెప్పించే పాత్రలో చక్కని నటన కనబరిచాడు. అలానే అతనికి జంటగా ప్రేయసి పాత్రలో గీత్ షా… చక్కగా ఒదిగిపోయింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగా… కాస్త సైకోలా బిహేవ్ చేసే పాత్రలో ఆకట్టుకుంటుంది. అలాగే హీరో మరదలిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. ఆమె అమ్మగా లేడి దాధాగా నటించిన నటి కూడా బాగా చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాక్షి చౌదరి అదరగొట్టిందనే చెప్పాలి. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చెలరేగి నటించింది. బాహుబలి ప్రభాకర్ జి.కె.పాత్రలో విలన్ గా. హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
దర్శకుడు నిర్ణయ్ పల్నాటి రాసుకున్న కథ… కథనాలు గ్రిప్పింగ్ గా… ఎంగేజింగ్ గా వున్నాయి. ఆర్.జి.సారథి అందించిన సంగీతం సీన్స్ ను ఎలివేట్ చేశాయి. ఓ రెండు ట్యూన్స్ చాలా రోజులు మనలను వెంటాడతాయి. ముఖ్యంగ క్రైం థ్రిల్లర్స్ కి కావలసిన నేపథ్య సంగీతం బాగా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. కోలా భాస్కర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి పెద్ద బలం. కథ, కథనాల పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ… అవేవీ సినిమాను ఆస్వాదించడంలో మనలను ఇబ్బంది పెట్టవు.
రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపొందిన చిత్రంగా “నేనెవరు”ను చెప్పుకోవచ్చు. ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్ ఇది. యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తీసుకున్న ఇతివృత్తం లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళందర్నీ ఆకట్టుకుంటుంది. “నేనెవరు” చిత్రం ఇంత చక్కగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు ఎంతో శ్రద్ధ తీసుకున్నట్టు ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపించింది. హీరో కోలా బాలకృష్ణ కెరీర్ కి ఈ చిత్రం ఓ టర్నింగ్ పాయింట్ లా ఉంది. కోలా భాస్కర్ ఎడిటింగ్, ఆర్.జి.సారథి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ సినిమాలోని థ్రిల్లింగ్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.
( చిత్రం : నేనెవరు, విడుదల : 02- డిసెంబర్ – 2022, దర్శకత్వం : నిర్ణయ్ పల్నాటి, రేటింగ్ : 3.25/5
నటీనటులు : తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు. తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి,నీరజ తదితరులు.
కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్,
ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి)