* మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున “ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా” అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.
#NBK111కు ‘దాదా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్ ఉంది. పోస్టర్లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్, లెదర్ జాకెట్, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్తో రౌడీ, గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఆయన సీరియస్ ఎక్స్ప్రెషన్, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్‌లోని పవర్‌ను మరింత ఎలివేట్ చేశాయి.
టైటిల్ గ్లింప్స్ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్, ఆరాను ప్రజెంట్ చేస్తూ, ఆయనను ‘షేర్’ (సింహం)గా సంబోధించే వాయిస్‌ఓవర్‌తో వీడియో ఓపెన్ అవుతుంది. పోలీస్ అధికారులు ఆయనను చుట్టుముట్టి ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి’ అని బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అదిపోయింది, ఈ సీక్వెన్స్ అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసేలా ఉంది.
దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణను లార్జర్ దేన్ లైఫ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. ఎస్. థమన్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్ ఇంపాక్ట్‌ను మరింత పెంచారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘రాజా హూన్ మైన్’ ట్రాక్ సీక్వెన్స్‌కు మరింత ఎనర్జీ, ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. మొత్తంగా గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ మాస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు పెంచింది.
పోస్టర్, టైటిల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ‘దాదా’ డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘దాదా’లో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్ ఎస్. కశ్యప్, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. థమన్ పనిచేస్తున్నారు. ఏఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ స్పెక్టకిల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్ థమన్
డీఓపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ఐఎస్సి
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
