లాలెట్టన్ మోహన్ లాల్ చేతుల మీదగా ‘డియర్ కృష్ణ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిరుప్రాయం’ విడుదల

First single 'Chiruprayam' released from 'Dear Krishna' by Lalettan Mohanlal
First single 'Chiruprayam' released from 'Dear Krishna' by Lalettan Mohanlal
Spread the love

స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన చివరి పాట ఇదే..

పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథను దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు.
రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే భక్తులు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఓ మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ ఇతివృత్తమే డియర్ కృష్ణ సినిమా సబ్జెక్ట్. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ పేర్కొన్నారు.
కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ చిరుప్రాయం పాట లాలెట్టన్ మోహన్ లాల్ గారి చేతుల మీదగా విడుదల చేశారు. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన చివరి పాట ఇది.
ఈ సందర్భంగా లాలెట్టన్ మోహన్ లాల్ గారు మాట్లాడుతూ : శ్రీకృష్ణుడు చేసిన ఒక మిరకిల్ పాయింట్ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ చిరుప్రాయం నా మనసును హత్తుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాట మీ హృదయాలను కూడా హత్తుకుంటుంది. ఈ పాటలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్రం: డియర్ కృష్ణ, నటీనటులు: అక్షయ్, మమిత బైజు, ఐశ్వర్య, రచయిత & ప్రొడ్యూసర్: పీ ఎన్ బలరామ్, డైలాగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన : దినేష్ బాబు, సినిమాటోగ్రపీ : దినేష్ బాబు, ఎడిటర్ : రాజీవ్ రామచంద్రన్, సంగీతం : హరి ప్రసాద్, లిరిక్స్: గిరిపట్ల
చీఫ్ అసోసియేట్ అండ్ అడిషనల్ డైలాగ్స్: నాగ నందేశ్వర్ గిడుతురి(నందు), పీఆర్ఓ: హరీష్, దినేష్