మహేంద్రగిరి వారాహి ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. మంచి డివైన్ కంటెంట్ ఉంది : ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని

"Mahendragiri Varahi is a movie that must be watched in theaters. It features excellent divine content," said actor Akhil Akkineni at the pre-release event.
"Mahendragiri Varahi is a movie that must be watched in theaters. It features excellent divine content," said actor Akhil Akkineni at the pre-release event.
Spread the love

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అఖిల్ అక్కినేని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ నిర్మించిన లక్ష్మణ్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే అలాంటి కంటెంట్‌ను అందించగలగాలి. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు థియేటర్‌లో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. ఇలాంటి నిర్మాతలు మన పరిశ్రమకు మరింతమంది కావాలి. నేను చిన్నప్పటి నుంచి సుమంత్ అన్న ఒడిలోనే పెరిగాను. నాకు ఏది కావాలన్నా ఎక్కువగా సుమంత్‌నే అడిగేవాడిని. ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడూ నాకు నో చెప్పలేదు. ఈరోజు ఆయన ఫంక్షన్‌కు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా పాజిటివ్ ఫీలింగ్. ఐ లవ్ యూ బ్రదర్. సిద్దుకి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఆయన వేరే సినిమా కోసం సపోర్ట్ చేస్తూ ఇందులో చేయడం నిజంగా అభినందనీయం. ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ సంతోష్ గారు ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేశారు. ‘మహేంద్రగిరి వారాహి’లాంటి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆడబోతుంది. చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని నమ్మకం ఉంది. ఇంత మంచి కంటెంట్ బేస్ ఉన్న సినిమాని ఇస్తున్నందుకు టీమ్‌కి కంగ్రాజులేషన్స్. సెప్టెంబర్ 11న అందరూ థియేటర్‌లో చూడండి. మంచి కంటెంట్ ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్యూ. లవ్ యూ ఆల్.
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా లెనిన్ తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అఖిల్ గారికి కంగ్రాజులేషన్స్. ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. చివరి 40 నిమిషాలు చూసి షాక్ అయ్యాను. అంత అద్భుతంగా చేశారు. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం నిర్మాత మధుగారు. మేము గతంలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాము. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ గారు చాలా ఫ్రీడమ్ ఉన్న కెరీర్‌ను సెట్ చేసుకున్నారు. ఆయన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘మహేంద్రగిరి వారాహి’ ద్వారా అద్భుతమైన సినిమా. మా ఇద్దరం కలిసి చేసిన సీన్ చాలా బావుంటుంది. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. అనుప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడండి. థాంక్యూ.
హీరో సుమంత్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ మూడు సంవత్సరాల క్రితం మొదలైంది. కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో చేయాలి. అలాంటి స్థాయిలో నిర్మించే నిర్మాత కోసంచూశాం. అమ్మవారి ఆశీస్సులతో నిర్మాత మధుగారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమా ఒక లెవల్‌కు వచ్చింది. తర్వాత లక్ష్మణ్ గారు ఎంటర్ అయ్యారు. మరో లెవల్‌కు పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా చాలా విభిన్నంగా చేశాము. దాదాపు 150 థియేటర్స్ లో అమ్మవారి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ సినిమా వెనుక ఏదో శక్తి ఉన్నట్టు మేము ఫీలయ్యాము. సెప్టెంబర్ 11న మా కష్టార్జితం మీరు తెరపై చూడబోతున్నారు. ఇందులో నేను, సిద్దు చేసిన ఒక సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్‌గా ఉంటుంది. డైరెక్టర్ సంతోష్ ఆ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మా నిర్మాతలు ఈ సినిమా చూశారు. చూసిన తర్వాత వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుంది. సిద్దు వచ్చిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ కథని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. సినిమాలో ఆయన కొత్త రూపాన్ని చూస్తారు. ఈ సినిమాకి ఆయన బరువు పెంచారు. అలీ గారితో, బ్రహ్మానందం గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా కొత్తగా కనిపిస్తారు. పెద్ద మనవడుకి సపోర్ట్ అందించడానికి చిన్నమనవడు వచ్చాడు(నవ్వుతూ) వాడికి థాంక్స్ అని నేను చెప్పకూడదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరిగాడు. మొన్న ‘లెనిన్ తో బ్లాక్‌బస్టర్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. ‘లెనిన్’ సినిమా చూస్తున్నప్పుడు యాక్టర్‌గా నేను గర్వపడ్డాను. అంత అద్భుతంగా చేశాడు. తన సక్సెస్‌లో ఎక్కువ సంతోషపడిన నేనే. తను ఈ వేడుకకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 11న అందరూ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందరం థియేటర్స్‌లో కలుద్దాం.
బ్రహ్మానందం మాట్లాడుతూ: ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల్ గారికి మా నిర్మాతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమంత్ అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి, మంచి మనిషి. తన పాత్రని తూకం వేసినట్టు నటిస్తారు. పాత్రకి ఏం కావాలో అదే చేస్తారు. ‘ప్రేమ కథ’ నుంచి ఈరోజు వరకు తన జర్నీ నాకు తెలుసు. అలాగే సిద్దు జొన్నలగడ్డ సినిమాలో చాలా చక్కని పాత్ర చేశారు. నిర్మాత అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాలో నిజంగానే నేను చాలా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. దర్శకుడు సంతోష్ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు. నటుల నుంచి ఎలాంటి పెర్ఫార్మన్స్‌ను రాబట్టుకోవాలో తనకు తెలుసు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. అఖిల్ గారు మా లక్కీ చార్మ్. ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ ఆయనే లాంచ్ చేశారు. దానికి చాలా మంచి పేరు వచ్చింది, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి పది రెట్లు రావాలని, వస్తాయని కోరుకుంటున్నాను. సిద్దు గారికి కథ, క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశారు. ఆయన వల్ల ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. మా నిర్మాతలు మధుగారు, లక్ష్మణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఇందులో చాలా కొత్తగా బ్రహ్మానందం గారిని చూడబోతున్నారు. అలాగే అలీ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమంత్ గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నాకు ‘సుబ్రహ్మణ్యపురం’తో అవకాశం ఇచ్చారు. వారితో నా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ మాట్లాడుతూ: ఈ సినిమాలో పనిచేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మధుగారు, మా డైరెక్టర్ గారు, సుమంత్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది చాలా డిఫరెంట్ ఫిలిం. చాలా పెద్ద సినిమా. దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను
నిర్మాత మధు మాట్లాడుతూ: ఈ సినిమా చేయడం నిర్మాతలుగా మా అదృష్టం. అఖిల్ గారు ఈ వేడుకకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. లెనిన్ హిట్ వైబ్ మాకూ రావాలని కోరుకుంటున్నాను. సిద్దు జొన్నలగడ్డ గారు మా సినిమాని మరో మెట్టు పైకి తీసుకువెళ్లారు. సుమంత్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. రంగమార్తండ సినిమాతో ఒక అడుగు ముందుకు వెళ్లాను. ఈ సినిమాతో మరో 10 అడుగులు ముందుకు వెళ్తాను అని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమాకి మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను.
అలీ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సుమంత్ గారితో ‘యువకుడు’ సినిమా నుంచి జర్నీ ఉంది. ‘వారాహి’ అద్భుతమైన సినిమా. ఇందులో బ్రహ్మానందం గారితో కూడా కలిసి నటించడం కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుమంత్ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. అందరూ థియేటర్‌లో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.
మంజు భార్గవి మాట్లాడుతూ: ఈ సినిమాలో పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారిని నేను చాలా సంవత్సరాలుగా పూజిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ: ఈ సినిమాలో ‘వాటే సర్ జీ’ పాట రాశాను. అనుప్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సుమంత్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.