టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిర్మాత మున్నా మాట్లాడుతూ…
సినిమాలంటే నాకున్న ప్యాషన్ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మoచి జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాను. అది రిస్క్ అని నాకూ తెలుసు. కానీ ఇప్పుడు మా సినిమా ఆడియో టి`సిరీస్ వంటి ప్రఖ్యాత సంస్థ తీసుకోవడం, వారి చార్ట్‌బస్టర్‌లో మా ‘మెకానిక్’ ఆడియో దూసుకు పోవడంతో ఆ రిస్క్‌కు తగిన ఫలితం దక్కింది అనిపిస్తోంది. మా సహ నిర్మాతలు నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండరాశి ఉపేందర్‌ల సహకారం వల్లనే మంచి సినిమా నిర్మించగలిగాను. వారికి నా థ్యాంక్స్. వారి సహకారం వల్లనే మా మెకానిక్ సినిమాను జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం “అని అన్నారు.
దర్శకుడు ముని సహేకర మాట్లాడుతూ…
మంచి చిత్రం రావాలంటే మంచి నిర్మాత దొరకాలి. నాకు మంచి నిర్మాతలే కాదు.. గట్స్ ఉన్న నిర్మాతలు దొరికారు. దేనికి ఎంత అవుతోంది అని ఆలోచించకుండా ఖర్చుపెట్టారు. వినోద్ యాజమాన్యగారు పాటల విషయంలో తన స్వంత సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి పనిచేశారు. తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా మంచి పాటలు రావటానికి మాచేత ఖర్చు పెట్టించారు. ఇందుకు ఉదాహరణ సిద్‌శ్రీరాం గారు మా సినిమాలో ఓ పాట పాడటం. ఆ పాట ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వగైరా ఛానల్స్‌లో 10 మిలియన్ల వ్యూస్కి దగ్గరై ట్రెండింగ్ లో ఉంది…నా తొలి సినిమా విడుదలకు ముందే ఆడియో మంచి సక్సెస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్‌లు కూడా చక్కగా సూటయ్యారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. తనికెళ్ల భరణిగారు అందించిన సహకారం మరువలేనిది. ఆడియో లాగే సినిమా కూడా26న రిలీజ్ అయి, మా అందరికీ మంచి విజయాన్ని అందిస్తుంధని ఆశిస్తున్నా” అన్నారు.
తనకెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, కిరీటి, జబర్ధస్త్ దొరబాబు, జబర్ధస్త్ పణి, సంద్య జనక్, సునీత మనోహర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, లిరిక్స్: ముని సహేకర, డీఓపీ: ఎస్.పి. శివరాం, ఎడిటర్: శివ శర్వాణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: కపిల్ మాస్టర్, బాలు మాస్టర్, పీఆర్వో: బి. వీరబాబు, సహ నిర్మాతలు: నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్, నిర్మాత: ఎం. నాగ మునెయ్య (మున్నా), దర్శకత్వం: ముని సహేకర.