శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ‘ధడక్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సౌత్ సినిమాల మీద తన ఆసక్తిని చూపించిన జాన్వీకపూర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘దేవర’తో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘దేవర’ సినిమా పాన్ ఇండియా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది జాన్వీ. సీనియర్ ఎన్.టి.ఆర్, శ్రీదేవి తరహాలో తారక్, జాన్వీల కాంబో పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కెరీర్ పై ఎంతో సంతృప్తిగా ఉన్న జాన్వీ తాజా ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. అంతేకాదు సినిమా అంటే అందరిదీ అని ఇది భాషా, జాతితో విడదీయలేమని చెప్పారు. ఈమధ్య డబ్బింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి. కంటెంట్ బాగుండటం వల్ల వాటితో ఆడియన్స్ ఎంటర్ టైన్ అవుతున్నారని జాన్వీ అన్నారు. అంతేకాదు ఓటీటీల వల్ల కొన్ని మంచి కథలు చిత్రాలుగా చేస్తున్నారని తెలిపారు. ఇక తన కెరీర్ లో ఛాలెంజింగ్ తో కూడుకున్న కథలు ఎంపిక చేసుకుంటు న్నానని.. పాత్రకు ఎంతవరకు కావాలో.. ఎంత న్యాయం చేయగలనో అంత ఇస్తున్నానని అన్నారు. మంచి డాన్స్, వినోదం కూడా పండించే పాత్రలు చేయాలని ఉందని జాన్వీ చెప్పారు. తన తల్లి దక్షిణాది సినిమాలతోనే పరిచయం అయ్యారు. అందుకే అక్కడ తనకు ప్రేమాభిమానాలు దక్కాయని అన్నారు. నటిగా తనని తాను నిరూపించుకునే సమయమిదే అని జాన్వీకపూర్ అంటున్నారు. ‘దేవర’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఆ సినిమా తర్వాత వరుస స్టార్ సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటుందని చెప్పొచ్చు. సినిమాలతో పాటుగా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న జాన్వీకపూర్ సౌత్ ఆడియన్స్ ప్రేమను కూడా పొందాలని అనుకుంటుంది.
జాన్వీకపూర్ : ఛాలెంజింగ్ పాత్రలపై మోజు!
