‘జనక అయితే గనక’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

'Janaka Buti Ganaka' release trailer released
Spread the love

టాలీవుడ్‌ కుర్ర హీరో సుహాస్‌ ఫుల్‌ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తుండగా.. బలగం, లవ్‌విూ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తే.. ఎల్‌కేజీ, యూకేజీలకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్‌ క్లాస్‌ యువకుడు(సుహాస్‌) తనకు పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ కాలంలో పిల్లలను పెంచడం కష్టమని పిల్లలు వద్దనుకుంటున్నా సుహాస్‌కు సడన్‌గా తన భార్య గర్భవతి అంటూ షాక్‌ ఇస్తుంది. అయితే తాను వాడిన కండోమ్‌ వలనే ఇలా అయ్యిందంటూ నాసిరకం కండోమ్‌లను సప్లయ్‌ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. అయితే ఈ కేసు సుహాస్‌ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది. చివరకు తాను కండోమ్‌ కంపెనీపై పెట్టిన కేసు గెలిచాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో సుహాస్‌తో పాటు, సంగీత్‌, వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

Leave a Comment