ఆ నలుగురిలో నేను లేను : నిర్మాత అల్లు అరవింద్

I am not among those four: Producer Allu Aravind
Spread the love

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన సమర్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆవేదనలో అర్ధం ఉంది! నిజం ఉంది.
ఆ నలుగురిలో నేను లేను, ఎప్పుడో తప్పుకున్నాను. నన్ను ఇందులో కలపకండి. ఆ నలుగురి వ్యాపారం లోంచి బయటకు వచ్చేసాను.
తెలంగాణ లో ఒక్క థియేటర్ కూడా నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించుకుంటూ వచ్చాను. 1500 థియేటర్లలో ఇప్పుడు 15 కూడా లేవు.
ఎవరైనా రెన్యూవల్ చేస్తానన్నా వద్దంటున్నాను. లీజుకు మాత్రమే ఒప్పుకుంటున్నాను.
50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నిర్మాత గా వున్నాను. సినిమాలు తీయడమే నా వృత్తి.
పవన్ సినిమా ముందు థియేటర్లు మూసి వేస్తాననడం దుస్సాహసం. థియేటర్ల సమస్యకు సంబంధించి మూడు మీటింగులు జరిగితే ఒక్క సమావేశంలోనూ నేను పాల్గొనలేదు.
ఇండస్ట్రీ కష్టంలో వున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ను కలిశాం.
సింగిల్ సినిమా హాళ్లకు చాలా సమస్యలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ చెప్పినా ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రిని కలవలేదు. ఇప్పటికైనా ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావాలి.
ఇండస్ట్రీ నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఇండస్ట్రీ కి హెల్ప్ చేస్తున్నారు.
నోట్ : ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఆ నలుగురు అంటే… అల్లు అరవింద్, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, దామోదర్ ప్రసాద్. ఈ నలుగురి చేతుల్లోనే అన్ని థియేటర్లు ఉండేవి! ఇప్పుడు ఆ నలుగురిలో నేను లేను! తన దగ్గర 15 హాళ్ళు కూడా లేవు అని అంటున్నారు అల్లు అరవింద్)
-డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment