హృతిక్ రోషన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’ .. వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా వయాకామ్ 18 స్టూడియోస్`మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హృతిక్ లుక్‌ను, క్యారెక్టర్ డిటెయిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హాలీవుడ్ చిత్రం టాప్ గన్ తరహాలో మన దేశం నుంచి మొట్టమొదటి సారిగా ఎవియేషన్ జానర్‌లో రూపొందుతున్న ఈసినిమాలో ఆయన ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా అనే స్క్వాడ్రన్ పైలట్ పాత్రలో కనిపించబోతున్నాడు.
హృతిక్ రోషన్ లుక్ అదుర్స్!
