‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల!

A Massive Festival Treat- The Highly Energetic Ganesh Anthem From Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens Bhagavanth Kesari Unveiled
Highly energetic Ganesh song released from 'Bhagwant Kesari'!
Spread the love

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు. గణేష్ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు. బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌ లు, గెటప్‌ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్.