అంతా తమనే చేశాడు.. ‘గుంటూరు కారం’లో ఎన్నో విశేషాలు

He did everything himself.. There are many features in 'Guntur Karam'
Spread the love

మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్‌ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్‌ అవుట్‌ అన్నారు. కానీ తమన్‌ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్‌ పి.ఎస్‌ .వినోద్‌ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్‌ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్‌. మహేశ్‌ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా ఉంది. మహేశ్‌ బాబుతో పనిచేయడం సవాలే. ‘గుంటూరు కారం’ నుంచి పి.ఎస్‌. వినోద్‌ వైదొలగడానికి కారణమేంటో నాకు తెలీదు. నిఖిల్‌ హీరోగా నా మిత్రుడు భరత్‌ కృష్ణమాచారి ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘లియో’ తర్వాత నేను పనిచేయాల్సిన సినిమా కూడా అదే. నాకు మంచి మిత్రుడు అయిన తమన ఓ రోజు ఫోన చేసి ‘గుంటూరు కారం’ సినిమాకి పనిచేయాలన్నారు. నేను నా కమిట్‌మెంట్స్‌ గురించి చెబితే ‘అదంతా మేం చూసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన సినిమా. తప్పకుండా రావాలి’ అని అన్నారు. అలా ఇతర కమిట్‌మెంట్స్‌ను రీ షెడ్యూల్‌ చేసుకుని ఈ సినిమాలో భాగమయ్యా’’ అని అన్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌` త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. హ్యాట్రిక్‌ విజయం కోసం త్రివిక్రమ్‌ కృషి చేస్తున్నారు. మహేశ సరసన శ్రీలీల, విూనాక్షి చౌదరి నాయికలు. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Related posts

Leave a Comment