‘మామామశ్చీంద్ర’ తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలవగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 7 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో నిలిచి..సుధీర్‌బాబు ఈసారి తప్పనిసరిగా భారీ హిట్ కొడుతాడనే నమ్మకాన్ని ఇచ్చింది. ఈక్రమంలో టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి మీడియాతో చిట్‌చాట్ చేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు గతంలో ‘సెహరి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రెడ్, నేల టికెట్టు’ సినిమాల్లో కథానాయికగా చేసిన మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, డైరెక్టర్ నన్ను సరికొత్తగా ప్రజెంట్ చేశాడని, ఈ సినిమాలో నా నట విశ్వరూపం చూస్తారని అన్నారు.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...