టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబిరెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్ 12న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...