పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌!

Good news for Power Star Pawan Kalyan fans!
Spread the love

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రం ఊహించిన విధంగా మధ్యలో చాలాసార్లు నిలిచిపోయింది. ఈ సినిమా స్క్రిప్టి దశలోనే అనేక రకాల మార్పులతో ఆలస్యం అయింది. ఇక మొత్తానికి హరీష్‌ శంకర్‌ చాలా హడావిడిగానే సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసినప్పటికీ కూడా మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలానే రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాను కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక పవన్‌ కేవలం ఇప్పుడు ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ ఉన్నాడు అని కూడా కథనాలు రావడంతో ఉస్తాద్‌ ‘భగత్‌ సింగ్‌’ కూడా ఆగిపోతుందేమో అని అనేక రకాల గాసిప్స్‌ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇలాంటి కథనాలు వైరల్‌ అవుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌ యెర్నేని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అసలు ఏమాత్రం ఆగిపోలేదు అని త్వరలోనే ఇది సరైన ట్రాక్‌లో ముందుకు సాగుతుంది అని ఒక మాటలోనే తేల్చేశారు. ఇక ఈ యాక్షన్‌ థ్రిల్లింగ్ సినిమాను తప్పకుండా సంక్రాంతికి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ అప్పుడు కుదరకపోతే సినిమాను వీలైనంత త్వరగా సమ్మర్ లో అయినా విడుదల చేస్తామని నిర్మాత ఒక వివరణ అయితే ఇచ్చారు. మొత్తానికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఫ్యాన్స్‌ కు అయితే గుడ్‌ న్యూస్‌ వచ్చినట్లు అయింది. ఇక ఈ సినిమాలో పొలిటికల్‌ సెటైర్స్‌ చాలా పవర్ఫుల్‌ గా ఉండబోతున్నాయి అని ఇటీవల హరీష్‌ శంకర్‌ కూడా ఒక హింట్‌ అయితే ఇచ్చాడు. ఇక హరీష్‌ శంకర్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల ప్రత్యేకంగా వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ తో మాట్లాడిన హరీష్‌ శంకర్‌ ఒక విషయం కూడా చెప్పాడట. వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా షూటింగ్‌ పూర్తి చేద్దామని ముందు ఒక కీలకమైన షెడ్యూల్‌ కోసం మాత్రం పది రోజుల డేట్స్‌ ఇస్తే చాలు అని హరీష్‌ శంకర్‌ చాలా సింపుల్‌ గా చెప్పాడట. దీంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2024 ఎన్నికల కంటే ముందుగానే విడుదల చేయాలి అని అనుకుంటున్నారు.

Related posts

Leave a Comment