శుభశ్రీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Golden chance for Subhasree!
Spread the love

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్‌ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన అంటే, సాక్షాత్తూ పవన్‌ కళ్యాణ్‌ పక్కన అదీ ‘ఓజి’ సినిమాలో చేస్తోంది. ఇది ఆమె సాంఫీుక మాధ్యమం ద్వారా ప్రకటించింది. ‘ఓజి’ దర్శకుడు సుజీత్‌తో ఒక ఫోటో పెట్టి, ‘ఓజి’ పోస్టర్‌ కూడా షేర్‌ చేసి, తాను పవన్‌ కళ్యాణ్‌ పక్కన చేస్తున్నా అని చెప్పింది. ఆమె పవన్‌ కళ్యాణ్‌ అభిమాని అని చెప్పింది, అలాంటిది అతని పక్కన నటించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఆ సినిమా ఛాయాగ్రహణం అందిస్తున్న రవి కే చంద్రన్‌తో కూడా ఒక ఫోటో షేర్‌ చేసింది. ఒరిస్సా కి చెందిన ఈమె బిగ్‌ బాస్‌ 7 తెలుగు సీజన్‌ లో ఇంట్లోకి వెళ్లడం, తెలుగు ప్రజలందరికీ పరిచయం అవటం జరిగింది. బిగ్‌ బాస్‌ ఇంట్లో ఆటలు కూడా బాగానే ఆడింది. కానీ హౌస్‌ లోంచి బయటకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా చేస్తోంది.

Related posts

Leave a Comment