డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి సంబంధించిన సర్వసభ్య సమావేశము చిత్రపురి కాలనీ ఎం.ఐ.జి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశములో అభివృద్ధి చేసుకోవాల్సిన పలు అంశాలు, పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న పనులకు వ్యక్తి గత స్వార్థంతో ఆటకం కలిగిస్తున్న వారిని సొసైటీ సభ్యత్వం నుండి తొలగించాలని, వారి ఫ్లాట్ రద్దు చేయాలని సభ్యులు కోరడమైనది. ఈ కష్ట కాలంలో చిత్రపురి ను ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని వారి టీమ్ కు సభ్యులు అందరు అండగా ఉంటామని సంపూర్ణ మద్దత్తు తెలియజేయడమైనది.
ఘనంగా చిత్రపురి కాలనీ సర్వసభ్య సమావేశం
