వైరల్‌ అవుతోన్న నితిన్‌, సిద్దు జొన్నలగడ్డ ఫన్‌ ఇంటర్వ్యూ..

Fun interview of Nitin and Siddu Jonnalagadda which is going viral..
Fun interview of Nitin and Siddu Jonnalagadda which is going viral..
Spread the love

టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నితిన్‌, వంశీ అండ్‌ శ్రీలీల టీం ఇప్పటికే ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డతో ఫన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నితిన్‌. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన డేంజర్‌ పిల్లా, బ్రష్‌ వేసుకో పాటలతోపాటు టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని నితిన్‌ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. నితిన్‌ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యేర్నేని, వై. రవిశంకర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సైన్‌ చేసిన టీ షర్ట్‌ను నితిన్‌కు బహుమతిగా అందించగా.. నెట్టింట వైరల్‌ అవుతుందని తెలిసిందే. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది!