హీరో పరుచూరి సుదర్శన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల!

First look released on the occasion of hero Paruchuri Sudarshan's birthday!
Spread the love

పరుచూరి సుదర్శన్, శ్రీ హీరోహీరోయిన్లుగా ఆమని, రఘుబాబు, నాజర్, పృథ్విరాజ్, సప్తగిరి కీలక పాత్రల్లో ఆర్.పి.సినిమాస్ బ్యానర్ పై రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో యన్.పాండు రంగారావు, చిన్నరెడ్డయ్య కోయ నిర్మిస్తున్న ప్రొడకన్ నెం.1 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్ అనే కాప్షన్ తో టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని చిత్రం యూనిట్ తెలియజేసింది. 2 సెప్టెంబర్ 2023 హీరో సుదర్శన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్. జైలు లోపల ఫెరోషియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న హీరో సుదర్శన్ లుక్ ఆసక్తికరంగా ఉంది. కెమెరా పట్టుకుని స్టైలిష్ గా నడుస్తున్నహీరో సుదర్శన్ లుక్ ను విడుదల చేసారు. డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. యోగి, దొరబాబు, జబర్థస్త్ రాజమౌళి, జబర్థస్త్ బాబి, సునీత మోహన్, రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ – శివకుమార్ దేవరకొండ, ఎడిటింగ్ – శివ శార్వాణి

Related posts

Leave a Comment