ఒక టీజర్ కోసం ఈ రేంజ్‌లో హడావిడి ఎప్పుడూ చూడలేదు. కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎగ్‌జైట్ అవుతారో ‘ఓజీ’ టీజర్ గురించి కూడా అదే స్థాయిలో ఎగ్‌జైట్‌కు గురవుతున్నారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం టీజర్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ఇస్తూ ఎక్కడలేని హైప్‌ను తీసుకొస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న టీజర్ వస్తుందని తెలుసు కానీ.. ఫలానా టైమ్ అని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. దీని గురించి ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ డీవివి సంస్థను ట్యాగ్ చేసి టైమ్ చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి డీవివి సంస్థ ఫ్యాన్స్‌కు గాడ్ లెవల్ రిప్లయి ఇచ్చింది. పవన్ బర్త్‌డేన అంతా పండగే కాబట్టి మీరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కు టీజర్ రిలీజ్ చేద్దామో అని పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఫ్యాన్స్ అందరి రెస్పాన్స్ చూసి సాయంత్రం టైమ్‌ను ఫిక్స్ చేస్తామని వెల్లదించింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. పవన్ పుట్టింది ఉదయం 11.02 నిమిషాలకు.. అదే టైమ్ ఫిక్స్ చేయండంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 72 సెకండ్ల నిడివి గల ఓజీ టీజర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో ఉండనుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ సహా అందరు సినీ ప్రేమికులు టీజర్ చూసి ఆహా ఓహో అనాల్సిందేనని ఇన్‌సైడ్ టాక్.యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
Related posts
-
ఇంకా “గగన”విహారం చేస్తున్నట్లుగానే ఉంది!!
Spread the love “డాకు మహారాజ్”లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక “డాకు... -
A Golden Opportunity.. I will always Cherish
Spread the love Child artist Gagana Geethika, who played the role of Payal in “Daku Maharaj”,... -
కొత్త ప్రొడక్షన్ కంపెనీ, వీఎఫ్ఎక్స్ సంస్థను ప్రారంభించిన ‘ఫన్ మోజీ’ టీం
Spread the love ‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర...