చిత్రం : ధమాకా
రేటింగ్ : 3/5
విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022
నటీనటులు:
రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్,
రావు రమేష్, తనికెళ్ళ భరణి,
సచిన్ ఖేడేకర్, తులసి, అలీ,
హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు
దర్శకత్వం : త్రినాధరావు నక్కిన
నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ‘ధమాకా’ పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం (23, డిసెంబర్ 2022)న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ‘ధమాకా’ విడుదలయింది. మరి ఈ సినిమాలో హీరో రవితేజ తన ‘ధమాకా’ చూపించాడా ..లేడా? తెలుసుకునే ముందు అసలు కథేంటో చూద్దాం…
కథ: పీపుల్స్ మార్ట్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత చక్రవర్తి కుమారుడైన వివేకానంద చక్రవర్తి అలియాస్ ఆనంద్ చక్రవర్తి (రవితేజ) తండ్రికి అండదండగా ఉంటాడు. అయితే చక్రవర్తి ఓ కారణంగా తన కంపెనీ షేర్లలో యాభై శాతం ఉద్యోగులకు రాసిచ్చి కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకొంటాడు. కంపెనీ తదుపరి సీఈవోగా ప్రకటించే ముందు పీపుల్స్ మార్ట్ కంపెనీపై కన్నేసిన జేపీ (జయరాం) చక్రవర్తి నుంచి బలవతంగానైనా వ్యాపారాన్ని లాగేసుకోవాలని కుట్ర పన్నుతాడు.
కూకట్‌పల్లిలోని మాస్ ఏరియాలో ఉండే స్వామి (రవితేజ) ఉద్యోగవేటలో ఉంటాడు. తన ప్రాంతంలో ఉండే ప్రణవి (శ్రీలీల)తో ప్రేమలో ఉంటాడు. అయితే ప్రణవితో స్వామి పెళ్లి జరిపించడానికి తండ్రి (రావు రమేష్) అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. పీపుల్ మార్ట్ కంపెనీని ఆక్రమించుకోవాలనుకొన్న జేపీ కుట్రను ఆనంద చక్రవర్తి అడ్డుకొన్నారా? పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత ఎందుకు తన పదవిని వదులుకొన్నారు? కంపెనీ షేర్లను ఉద్యోగులకు ఎందుకు ఇచ్చాడు. పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ ఎందుకు కన్నేశాడు? ఉద్యోగ వేటలో ఉన్న స్వామి చివరకు జాబ్ సంపాదించాడా? పీపుల్స్ మార్ట్ కంపెనీకి స్వామికి సంబంధం ఏమిటి? పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ కుట్రలను స్వామి అడ్డుకోవాలని ఎందుకు రంగంలోకి దిగాడు? శ్రీలీలతో పెళ్లి విషయంలో ఆమె తండ్రిని స్వామి ఎలా ఒప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ‘ధమాకా’ సినిమా కథ.
విశ్లేషణ : కథలో ఎలాంటి కొత్తదనం కనిపించని రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ ఎనర్జీ, బాడీలాంగ్వేజ్, శ్రీలీల గ్లామర్, డైలాగ్స్, మాస్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. మాస్, కమర్షియల్ అంశాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ధమాకా సినిమా ఓకే అనిపిస్తుంది. కొత్తదనం కోసం థియేటర్‌కు వెళ్లే వారికి మాత్రం కాస్త నిరాశే మిగులుతుంది. కథ విషయాన్ని పక్కన పెడితే.. మంచి కంటెంట్‌తో పేర్చుకొంటూ పోయిన సీన్లు మాత్రం ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి. రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. మాస్ మహారాజా రవితేజ ఆనంద్ గా, స్వామి గా డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడు. సచిన్ ఖేద్కర్ మరియు తులసి ల కుమారుడు రవితేజ (ఆనంద్) బిజినెస్ మ్యాన్ గా, తనికెళ్ళ భరణి మరియు తులసిల కుమారుడు రవితేజ (స్వామీ) కామన్ మ్యాన్ గా కనిపించి సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తారు. శ్రీలీల (ప్రణవి) రావు రమేష్ కి కూతురు గా నటించింది. తనకు ప్రపోజ్ చేసిన స్వామి కి ఓకే చెప్పేలోగా, తన తండ్రి ఆనంద్ ను పరిచయం చేస్తాడు. జయరామ్ నెగటివ్ షేడ్స్ లో ఇతరుల బిజినెస్ ను ఆక్రమించే విలన్ గా నటించారు. జయరాం కన్ను సచిన్ ఖేద్కర్ యొక్క పీపుల్ మార్ట్ కంపెనీ పై పడుతుంది. అయితే జయరామ్ సచిన్ ఖేద్కర్ కంపెనీ ను దక్కించుకుంటారా? దాన్ని అడ్డుకోవడానికి రవితేజ ఏం చేశాడు? శ్రీ లీల ఎవరికి ఓకే చెబుతుంది ఎలాంటి సన్నివేశాలన్నీ సినిమాపై ఆసక్తి కలిగిస్తాయి. సక్సెస్‌ఫుల్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి.. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా చనిపోవాలనే అనుకోవడమనే ఎమోషన్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. ప్రసన్న కుమార్ రాసిన కథ రెగ్యులర్, రొటీన్‌గా ఉంటుంది. కానీ దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ వల్లనే సినిమా మరింత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. దర్శకుడు త్రినాథ రావు సినిమాను నడిపించిన విధానంగా బాగుంది. రవితేజ మాస్ అప్పీల్, ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాకు పాజిటివ్ అంశాలుగా మారడమే కాకుండా జోష్‌ను కూడా కలిగించాయి. ఫస్టాఫ్ జాలీగా సాగిపోతే.. సెకండాఫ్ మాత్రం రెగ్యులర్‌గా, కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా డెస్టినేషన్ చేరుకొన్నదనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బెడిసి కొట్టింది. సెకండ్ హాఫ్ లో కథ సీరియస్ గా సాగే టైమ్ లో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు వస్తాయి. అక్కడ స్టోరీ కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకి కనెక్టివిటీ అనేది క్లియర్ గా కనిపించదు. జయరామ్ ను నెగటివ్ రోల్ లో చూపించగా, మిగతా పాత్రలు ఆ ఫ్లో లో వెళ్లిపోతాయి.
నటీనటుల విషయానికొస్తే… సినిమాకి ముందుగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది హీరో రవితేజనే. సినిమాను మొదటి నుండి చివరి వరకు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆక్ట్టుకున్నాడు. దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. కథను మొదటి నుండి చివరి వరకు చాలా బాగా హ్యాండిల్ చేశారు. రవితేజ ‘రాజా ది గ్రేట్’ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయలేదు. ఈ ‘ధమాకా’ ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. ఇద్దరూ పోటీపడి డ్యాన్స్ చేశారు. ఇందులో బ్యూటీ ఫుల్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ వున్నాయి. రవితేజ ఇమేజ్ స్టార్ డమ్ తగ్గట్టు మాస్ యాక్షన్ కూడా అద్భుతంగా వుంటుంది. మాస్ మహారాజ్ ఇమేజ్ ఉన్న రవితేజకు ఈ ధమాకా కథ కొత్తేమీ కాదు. కానీ రొటీన్, రెగ్యులర్ కథను తన ఎనర్జీ, బాడీలాంగ్వేజ్‌తో కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేశారు. సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మరింత జోష్ పెంచాడు. ఎప్పటిలానే పాటల్లో, ఫైట్స్‌లో తన ఎనర్జీతో ఆకట్టుకొన్నాడు. శ్రీలీలతో కలిసి మంచి మాస్, మసాలా అంశాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. రాఘవేంద్ర రావు సినిమా ‘పెళ్ళిసందడి’తో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన తర్వాత రవితేజతో ‘ధమాకా’ లాంటి ప్రాజెక్ట్ లో నటించిన హీరోయిన్ శ్రీలీల. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ లాంటి స్టార్ హీరో కావడంతో ఆమె క్రేజ్ బాగానే పెరిగిపోయింది. ఈ చిత్రంలో ప్రణవి అనే పాత్రలో నటించి రవితేజకు ధీటుగా డ్యాన్సులు ఇరగదీసింది. జింతాక్ పాటతో పాటు, వాట్స్ హ్యాపనింగ్ పాట అందులో వయోలిన్ బిట్ చాలా బాగా కుదిరాయి. శ్రీలీల ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ వున్నాయి. మంచి డ్యాన్సర్, వాయిస్, ఎనర్జీ అన్నీ వున్నాయి. పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. శ్రీలీల రెండో సినిమాకే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అందంతో పాటు తనలో చాలా ప్రతిభ వుంది. నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. శ్రీలీల చాలా ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్. అద్భుతమైన డ్యాన్సర్. తనే సొంతగా డబ్బింగ్ చెప్పింది. ‘పెళ్లి సందD’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీలకు మరోసారి తన ప్రతిభను రుజువు చేసుకొనేందుకు దొరికిన అవకాశాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకొన్నదని చెప్పవచ్చు. పాటల్లో ఊరమాస్ స్టెప్పులతో అలరించడమే కాకుండా గ్లామర్‌తో గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది. కీలక సన్నివేశాల్లో ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసింది.సినిమాలో శ్రీలీల కి ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. శ్రీలీల నటన సినిమాలో బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందం గా కనిపిస్తూనే, హీరో రవితేజ పక్కన అద్దిరిపొయే మాస్ స్టెప్పులు వేసింది. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే పాటలో రవితేజ, శ్రీలీల డ్యాన్స్ కుమ్మేశారు.
ఇక రావు రమేష్, హైపర్ ఆది కామెడీ ట్రాక్ సినిమాను మరింత ఫన్‌గా మార్చింది. జేపీగా జయరాం రెగ్యులర్ విలన్‌గా కనిపించాడు. మిగితా పాత్రల్లో ఆలీ, పవిత్రా లోకేష్, తులసి తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేద్ఖర్, జయరామ్, హైపర్ ఆది, ప్రవీణ్, పవిత్రా లోకేష్, తులసి, ఇతరుల నటన ఆకట్టుకుంది. సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ చాలా ప్లస్ అయ్యాయి. విలన్ గా జయరామ్ నటన బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇది వరకూ విలన్ గా చేశారు. ఎక్కువగా సాఫ్ట్ విలనీ వుంటుంది. ఇందులో మాత్రం కంప్లీట్ నెగిటివ్ రోల్. ‘ఇంత నెగిటివ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం’అని జయరాం ఒక సందర్భంలో అన్నారు. విలన్ గా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్యల ట్రాక్ ఎంత ఎంజాయ్ చేస్తామో .. ధమాకాలో రావు రమేష్, హైపర్ ఆది ట్రాక్ అంత అద్భుతంగా వుంటుంది. వీరి ట్రాక్ ఆద్యంతం అలరిస్తుంది.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, కెమరామెన్ కార్తిక్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. శేఖర్, జానీ, యశ్వంత్ సాంగ్స్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ యాక్షన్ అదరగొట్టారు. మాటలు మాస్ జనానికి బాగా నచ్చుతాయి. ”ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యు, యు విల్ సీ ఎ హీరో ఇన్ మీ’ ఇందులో డైలాగ్. దర్శకుడు త్రినాథరావు ఇరగదీశారు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు- అల్లు రామలింగయ్య కాంబినేషన్ లా ‘ధమాకా’ లో రావు రమేష్, ఆది ల కాంబో సరదాగా సాగిపోయింది. భీమ్స్ కూడా ధమాకా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. రవితేజను ద్రుష్టిలో పెట్టుకునే మ్యూజిక్ చేసినట్లువుంది. ఒకొక్క పాట ఇరగదీశాడు. ప్రసన్న డైలాగులు , భీమ్స్ మ్యూజిక్ , శేఖర్ మాస్టర్ వండర్ ఫుల్ గా కొరియోగ్రఫీ బాగా కుదిరాయి. ‘దండకడియాల్’ పాటకు థియేటర్లలో ఈలలే ఈలలు. డైలాగులు మాములుగా లేవు. ప్రసన్న ఇరగొట్టాడు. రవితేజ ఎలాంటి డైలాగులు చెబితే థియేటర్ అదిరిపోతుందో అలాంటి డైలాగులు అద్భుతంగా రాశాడు. భీమ్స్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రసన్న అద్భుతమైన మాటలు రాశారు. ధమాకా ప్లస్ పాయింట్స్.. రవితేజ ఎనర్జీ , ఎంటర్ టైన్ మెంట్, శ్రీలీల గ్లామర్ , నటన, కామెడీ, బీమ్స్ మ్యూజిక్, ప్రసన్న కుమార్ డైలాగ్స్, నక్కిన త్రినాథరావు డైరెక్షన్. దర్శకుడు త్రినాధరావు గత సినిమాలు నేను లోకల్, సినిమా చూపిస్తా మామా, హలో గురు ప్రేమ కోసమే, మేం వయసుకు వచ్చాం సినిమాలు ఎనర్జిటిక్ గా వుంటాయి. ఆ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారు. దానికి రెట్టించి ధమాకాని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు ప్రసన్నకుమార్ అందించిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. స్వామి, వివేకానంద చక్రవర్తి రోల్స్ పాత్రలను కలిపిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. పాత్రలకు తగినట్టుగా రాసిన డైలాగ్స్ సినిమాకు స్పెషల్ ప్యాకేజ్. రవితేజతో చెప్పిన డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఇక రెగ్యులర్, రొటీన్ సినిమాను కూడా నిలబెట్టే ప్రయత్నాన్ని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో చేశాడు. భీమ్ అందించిన పాటలు సిల్వర్ స్క్రీన్ మీద కేక పెట్టించే విధంగా ఉన్నాయి. పాటలకు తగినట్టుగా కొరియోగ్రఫి కూడా తోడవ్వడంతో సాంగ్స్‌లో జోష్, ఫైర్ కనిపించింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. ధమాకా మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రిలీజైన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. సినిమా చూపిస్తా మామా నుండి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో జర్నీ వుంది. ధమాకాకి అద్భుతమైన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే బుల్లెట్ లాంటి డైలాగులు రాశాడు. కెమరామెన్ కార్తి ఘట్టమనేని కూడా అద్భుతమైన వర్క్ చేశారు. విజువల్స్ అన్నీ వండర్ ఫుల్ గా వుంటాయి. హీరో స్టార్ట్ డమ్ ని ఫాలో అవుతూ వందకు వంద శాతం న్యాయం చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన సెట్స్ వేశారు. కాలనీ, ఆఫీసు సెట్స్, పీపుల్ టెక్ ఆఫీస్ ఏడు అంతస్తులని కూడా ఒక స్టూడియోలా వాడారు. ఎడిటర్ ప్రవీణ్ పూడిబ్రిలియంట్ వర్క్ చేశారు. కథ ను ఏమైతే చెప్పాలని అనుకున్నారో, ఆ విషయం లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దాదాపుగా విజయం సాధించారు. నటీనటుల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టడం లో సక్సెస్ అయ్యారు. టెక్నికల్ టీం లో సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ధమాకా నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. మాస్ మహారాజా ఈ చిత్రం తో మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ తో క్లాస్ మరియు మాస్ ఆడియెన్స్ ను ధమాకా ఆకట్టుకుంటుంది. సినిమాకి ప్లస్ పాయింట్ మ్యూజిక్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాలో చాలా బాగున్నాయి.