డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతేనంటోంది దీపికా పదుకోనే..!

Deepika Padukone says someone is next to me in discipline..!
Spread the love

పొదుపు, మదుపు.. విషయంలో నాకంటూ కచ్చితమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని నా బ్యాంకు ఖాతాలోని ప్రతి రూపాయీ నా కష్టార్జితం. నా చెమట ఫలం. దాన్ని పాపాయిలా పెంచాలని ఆరాటపడతానని ప్రముఖ బాలీవుడ్‌ నటీ దీపికా పదుకోనే పేర్కొన్నారు. సరిగ్గా నాలానే ఆలోచించే ఆంత్రప్రెన్యూర్స్‌ తారసపడితే.. ఆ స్టార్టప్‌లో సంతోషంగా పెట్టుబడి పెడతాను. ఇప్పటి వరకూ నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నీ దేశీ కంపెనీల మీదే పెట్టాను. నేను నటిని కావచ్చు. కానీ జన్మత క్రీడాకారిణిని. జీవితాన్ని ఆటలానే భావిస్తాను. ప్రపంచాన్ని మైదానంలా చూస్తాను. సినిమా బాగా ఆడిన ప్రతిసారీ కప్పు గెలుచుకున్న ఆనందం. ఓటమిని కూడా ఓ క్రీడాకారిణిగా హుందాగానే స్వీకరిస్తాను. ఆటమైదానం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ.. నా కంటే బాగా నటించేవాళ్లు చాలామందే ఉండవచ్చు. కానీ, డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతే. నేను.. స్వతహాగా అంతర్ముఖురాలిని. నలుగురిలోకి వెళ్లాలంటే ముడుచుకుపోయే అతి సాధారణ అమ్మాయిని. ఎవరినైనా ఓ మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. నా చుట్టూ ఓ రక్షణ వలయం నిర్మించుకుని బతికేస్తాను. ఆ గడి దాటి లోపలికి రావడం.. అందరికీ అసాధ్యం. ఒకరో ఇద్దరో నా వ్యక్తిగత ప్రపంచంలో ఉంటారు. వారసత్వంగా వచ్చిన విలువలు నాతోనే, నాలోనే ఉన్నాయి. నా ప్రతి నిర్ణయాన్ని అవి ప్రభావితం చేస్తాయి. సరిగ్గా పద్దెనిమిదేండ్ల వయసులో సూట్‌కేస్‌నిండా బట్టలతో, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో ముంబైలో అడుగుపెట్టాను. మెట్రోలో, ఆటోలో తిరగడం చాలాసార్లు కష్టంగా అనిపించేది. సకాలంలో లొకేషన్‌కు చేరుకోవడం ఇబ్బంది అయ్యేది. మంచి కారు కొనడం, ఓ డ్రైవర్‌ను నియమించుకోవడం నా తక్షణ లక్ష్యంగా మారింది. ఆ తర్వాత సొంతింటి కల. ఓ మహారాష్ట్ర కుటుంబం నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొన్నాను. నా వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. కుటుంబ విషయాల్ని సెట్స్‌లో పంచుకోను. సెట్స్‌ వ్యవహారాల్ని డైనింగ్‌ టేబుల్‌ మీద చర్చకు పెట్టను. ఒక్క రణ్‌వీర్‌తో తప్పించి ఇంకెవరితోనూ సినిమా విషయాలు మాట్లాడుకోను. నా భర్త మరేదో రంగానికి చెందినవాడైతే.. అదీ ఉండేది కాదు. బాలీవుడ్‌లో మనసు విప్పి మాట్లాడుకునేంత చనువు ఒక్క షారుక్‌ఖాన్‌ దగ్గర మాత్రమే ఉంది. ఫ్యాషన్స్‌ విషయంలో నాకంటూ కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందంగా అలంకరించుకోవడం నాకు ఇష్టం. అది నా మనసుకు నచ్చిన విషయం. నన్ను మెరుపు తీగలా తీర్చిదిద్దడానికి నాదైన నిపుణుల బృందం ఉంది. వాళ్లు కొత్త ప్రయోగాలు చేయడాన్ని ప్రోత్సహిస్తాను. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ అస్సలు పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని నా మూడ్‌ పాడుచేసుకోనని తెలిపారు.

Related posts

Leave a Comment