ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన వశిష్టకు, తన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సినిమానే ‘విశ్వంభర’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇదిలావుంటే.. ‘విశ్వంభర’ తర్వాత మరో కుర్ర డైరెక్టర్‌తో సినిమా చేయనున్నారట చిరంజీవి. తనెవరో కాదు, ‘దసరా’తో నానికి భారీ విజయాన్ని ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం నానితోనే ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత మెగా మూవీకి ఆయన రెడీ అవుతారనేది లేటెస్ట్ న్యూస్. ఇటీవలే చిరంజీవికి ఆయన ఓ కథ వినిపించారని, ఆ కథ చిరంజీవికి కూడా బాగా నచ్చిందని, బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేయమని శ్రీకాంత్‌ని చిరంజీవి ఆదేశించారనేది ఫిల్మ్‌వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. చిరంజీవి ‘విశ్వంభర’, శ్రీకాంత్ ఓదెల ‘ప్యారడైజ్’.. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, ఈ మెగా ప్రాజెక్ట్ ఉంటుందట. ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో పొక్కడంతో కుర్ర డైరెక్టర్లకు అవకాశాలిస్తూ భిన్నమైన ప్రయాణాన్ని చిరంజీవి సాగిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Related posts
-
ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్
Spread the love పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా... -
వర్మ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు
Spread the love ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో... -
హైదరాబాద్ నడిబొడ్డున ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ జాతర!
Spread the love ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల...