ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ టైటిల్ ఖరారు చేశారు. రామ్ 19వ చిత్రమిది. సోమవారం టైటిల్ రివీల్ చేయడంతో పాటు రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామ్ – లింగుస్వామి కాంబినేషన్… తొలిసారి రామ్ స్ట్రయిట్ తమిళ సినిమా… దర్శకుడు లింగుస్వామి తెలుగు సినిమా చేస్తుండటం… సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. అప్పటి నుంచి సినిమా కథ ఏమై ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అనే ఆసక్తి పెరిగింది. రామ్ క్యారెక్టర్, కథ గురించి ఈరోజు దర్శకుడు లింగుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్…
Category: MOVIE REVIEWS
సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ టీజర్ రిలీజ్
‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్‌తోనే పన్నా రాయల్ నుంచి మరో డిఫరెంట్ మూవీ రాబోతోందని అర్థమైంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా ‘ఇంటి నెం.13’ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్యబోతోందని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. ‘ఇంటి నెం.13’ టీజర్ విడుదలైన సందర్భంగా…
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉగాది సందర్భంగా.. ఏప్రిల్ 1 విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా … చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది. అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్…
‘బంగార్రాజు’ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : నాగార్జున
‘బంగార్రాజు’ మొదటిరోజు వసూళ్ళు 17.5 కోట్లు గ్రాస్ : నాగార్జున అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుదలైన మొదటిరోజునే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని శనివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్రకమంలో నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాబివందనం తెలియజేస్తూ ఆరంభించారు. జనవరి 14న…
‘వర్మ’ వీడు తేడా.. చిత్రంలోని పాట విడుదల
“గుండెలోన నువ్వే….” అంటూ హృదయాలను కదిలించే “వర్మ” వీడు తేడా చిత్రంలోని పాట సంక్రాంతి సందర్భంగా శనివారం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చిత్రం ట్రైలర్…
దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు : మెగాస్టార్ చిరంజీవి
”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు : చిరంజీవి ”భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని కోరుకుంటూ అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు” అంటూ తన…
‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్: ‘జనత’ తెలుగు టీవి ప్రచురించిన ప్రత్యేక న్యూ ఇయర్-2022 క్యాలెండర్ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఆవిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్, టీజేయూ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్, జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా, జనత టీవి…
‘బంగార్రాజు’లో నాగ చైతన్యను చూసి సర్ ప్రైజ్ అవుతారు : నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే… -చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది. -సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య…
‘అఖండ’ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అయింది : థ్యాంక్స్ మీట్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా గురించి చాలా వేదికలపై మాట్లాడాను. నిన్ననే ఓ డిస్ట్రిబ్యూషన్ ఫోన్ చేశారు. బాలయ్య గారి సినిమా అంటే సంక్రాంతి వస్తుంది. ఇంకో నాలుగు రోజులు ఉంచుతారా? సర్.. యాభై రోజులు పూర్తి అవుతంది అన్నారు. గత కొన్నేళ్లుగా ఇలా డిసెంబర్‌లో విడుదలై సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది కేవలం అఖండ మాత్రమే.…
సినీ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో ఛాంబర్ చర్చలు జరుపుతోంది : తమ్మారెడ్డి భరద్వాజ
`థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపి ప్రభుత్వానికి ఉంటుంది` అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా థియేటర్లు, సినిమా టిక్కట్లు, పెద్ద సినిమాలు ఆగిపోవడం వంటివాటిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ బుధవారం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలో ఏ సమస్య వున్నా ముందు మీడియా సమన్వయం పాటించాలి. సంబంధంలేని వ్యక్తులతో చర్చాగోష్టిలు జరపడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా వుంటుంది. దానికి మీడియా జవాబుదారితనం వహించాలి. అదేవిధంగా సినిమా సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసే హక్కు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్‌కే వుంది. కోర్టు ద్వారా ఎంపిక చేసిన ఛాంబర్‌లోని కొందరు సభ్యులు…
