‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఓ నటిగా అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలనుకుంటోంది. యశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్’ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హిట్ -3’లో కనిపించింది. ఇటీవల ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్…
Category: FILM NEWS
‘టాక్సిక్’ అలాంటి ప్రయాణమే..: రాకింగ్ స్టార్ యశ్
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి ‘టాక్సిక్’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్ డేట్‌లను పునఃసమీక్షించుకుంటున్నారు. ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీని ఖరారు చేయడం, కీలకమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్…
‘గాయపడ్డ సింహం’ ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్…
‘కర’ మూవీని పెద్ద హిట్ చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్…
జగపతిబాబు-లయ ‘వదలా’థ్రిల్లింగ్ టీజర్ లాంచ్
‘వదలా’ సాలిడ్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. అద్భుతమైన క్యాలిటీతో వచ్చింది. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో జగపతి బాబు వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్ ని లాంచ్ చేశారు. యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు. ఆమె కూడా అతనిపై అపారమైన ప్రేమతో, వారి బంధాన్ని…
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్
మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యరావు చేతులు మీదుగా విడుదలైన కన్న టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కృష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు…
ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్
హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న “ఫస్ట్ టైం” సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న “మంగళవారం” అగ్ర నటి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా…
నలుగురు రాక్షసుల చేతుల్లో థియేటర్లు’…
▪️‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదు అంటూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన ▪️ నైజాంలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు.. చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు ▪️ డిఫ్రెషన్ లో ఉన్నాను, నాకేమైనా ఐతే వారే బాధ్యులు ▪️ నేను లీగల్‌గా పోరాటం చేస్తాను ▪️ “ప్లీజ్ సేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న షెరాజ్ మెహదీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని నటుడు–దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, తన దర్శకత్వంలో తానే హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న ఈ…
ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ బ్యానర్ ఆవిష్కరణ
కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్రతి సంస్థ తమ బ్యానర్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తుంది. తమ బ్యానర్ కు సంబంధించిన లోగోను, టైటిల్ ను చాలా ఆర్టిస్ట్ గా రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తారు సదరు నిర్మాణ సంస్థ అధినేతలు . అలాగే బ్యానర్ అనౌన్స్మెంట్ కు ముందు సెంటిమెంటల్ గా దైవ దర్శనం చేసుకుని లోగో ప్రతులను దేవుడి ముందు ఉంచి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు . కాగా ప్రస్తుత విషయానికి వస్తే ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలింనగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ శాసనసభ్యులు, కె . పి. ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, బిజినెస్ మ్యాన్…
స్పెషల్ స్టోరీ… తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు
* ఏప్రిల్24 ఉత్తమ చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరావు 92 వ జయంతి శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలంటే పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ గుర్తుకువస్తుంది. కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు . ఉత్తమాభిరుచి గల నిర్మాత.. తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన నిర్మాత, తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు పంచిన ఏడిద నాగేశ్వరరావు 92 వ జయంతి నేడు. నటన మీద మక్కువతో.. నాటకాల్లో నటుడిగా, అనంతరం సినీనటుడిగా,తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. సినీచిత్ర నిర్మాణరంగంపై దృష్టి సారించి 1976లో స్నేహితులతో కలిసి మొదటి ప్రయత్నంగా ‘సిరిసిరిమువ్వ ‘ చిత్రాన్ని నిర్మాణ నిర్వాహకుడిగా నిర్మించారు. హిరోయిన్ జయప్రద మూగది, హీరో చంద్రమోహన్ డప్పు కొట్టుకునేవాడు. పెద్ద తారాగణమేమీ లేదు. అందరూ పెదవి…
