ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 2017లో “శతమానం భవతి” సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్ దీనికి దర్శకత్వం వహించారు. చిత్ర హీరో నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తరువాతే “శ్రీశ్రీశ్రీ రాజా వారు” వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.’శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం షూటింగ్…
Category: FILM NEWS
అవగాహనలేక అవాస్తవాలు బయటకు వస్తున్నాయ్..ఇప్పటికీ వైజాగ్ ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షుడిని నేనే: నిర్మాత కె.ఎస్.రామారావు స్పష్టీకరణ
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వైజాగ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. అది పూర్తిగా అసత్యం. ఇప్పటికీ నేనే దానికి అధ్యక్షుడిగా ఉన్నానని` ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా గురువారంనాడు హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కూలంకషంగా మాట్లాడారు. – ఎఫ్.ఎన్.సి.సి వైజాగ్ లో రూ 30 కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యా అనడం కూడా అవాస్తవం. – ఎవరో సరైన అవగాహన లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసుంటారని అనుకుంటున్నాను. – ఎఫ్ ఎన్ సి సి వైజాగ్‌కు గత ప్రభుత్వాలు రెండు చోట్ల స్థలాలు ఇచ్చాయి. ఆ స్థలాన్ని అభివృద్ధి పనుల కోసం మాకు అప్పగించడంలో ఇప్పటి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అని వివరించారు. పూర్తి వివరాలను ఆయన…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ టైలర్ కు విశేష స్పందన
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్…
సర్వోదయ సంకల్ప యాత్రలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకట స్వామి
భూదానోద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం పోచంపల్లి లో పంచాయతీరాజ్ సర్వోదయ సంకల్ప యాత్ర ఏఐసిసి నాయకురాలు మాజీ ఎంపీ పంచాయతీ సంఘటన్ చైర్మన్ శ్రీమతి మీనాక్షి గారు చేపట్టగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొసు రాజుగారు. మహేష్ గౌడ్ గారు మధుయాష్కి గారు. ఎమ్మెల్యే సీతక్కయాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకట స్వామి, వరలక్ష్మి. మల్లేష్ వెంకటేష్ ఉపేందర్ రెడ్డి. జడ్పిటిసి నగేష్ మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపిటిసిలు సర్పంచులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర విజయవంతం చేసినారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ కు సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సత్కారం
50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎం.డి.అబ్దుల్ ఎన్నికయ్యారు. గతంలో ఈ అసోసియేషన్ లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్బంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఎం.డి.అబ్దుల్ ను హైదరాబాద్ లో తమ సంస్థ కార్యాలయంలో సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిరిసాల యాదగిరి మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇది 50 సంవత్సరాల చరిత్ర గల అసోసియేషన్. నిజమైన ఫిల్మ్ జర్నలిస్టులు అనేది ప్రారంభమైంది ఈ సంస్థ ద్వారానే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా రంగానికి 24 క్రాఫ్టులు ఉంటే.. సినిమా జర్నలిస్టులు అనేది 25 క్రాఫ్టు అవ్వాలని కోరుకుంటున్నాను.…
Here’s the official word – Vijay Antony is the Anti-Bikili in ‘Bichagadu 2’
Actor Vijay Antony’s unceasing drive to entertain with content-and-entertainment-driven movies has earned him the undisputed safe bet of trade circles and favourite of universal crowds. In particular, his magnum opus ‘Pichaikkaran’ that recently celebrated its 6th anniversary became a raging hit in not just Tamil, but a 144-day blockbuster in the Telugu version – Bichagadu as well. With the official announcement on Bichagadu 2 made, the expectations and excitements got bigger. Recently, the Tamil slogan #Bikili Yoda Aethiri #AntiBikili has been trending on all social media platforms. Finally, the official…
పాన్ ఇండియా స్దాయిలో మే 4న దాసరి ఫిల్మ్ అండ్ టీవి నేషనల్ అవార్డ్స్
దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్ , ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డ్స్ ను ప్రధానం చేయనున్నారు. నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాము.పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్స్ కు దాసరి నేషనల్ అవార్డ్ లను ప్రధానం చేయబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో హైదరాబాదు లోనె జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల సిఎం లను ముఖ్య అతిథులుగా…
పాన్ ఇండియా లెవెల్లో వింగ్స్ మిస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా 2022 కాంటెస్ట్
మోడలింగ్ రంగంలో ఎదగాలన్న కల, మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా, మిసెస్ ఇండియా అవ్వాలన్న లక్ష్యం మీలో ఉందా అయితే మీకోసం మేమున్నాం అంటూ అవకాశాలు అందించేందుకు రెడీ అయింది వింగ్స్ మోడల్ హబ్. ఇప్పటివరకు కేవలం హైద్రాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వారితో ఈ మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్ నిర్వహించి ఫైనల్ గా హైద్రాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పోస్టర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్ చాందిని, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ, మహేష్, కృతిక మిస్సెస్ ఇండియా 2018,…
కరీంనగర్ టు రాజమండ్రి వయా లండన్: ‘టీ-3’తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!!
కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్ రుచి-నాణ్యత-సంతృప్తిలకు ప్రధమ ప్రాధాన్యం!! *** “టీ” ప్రియుల మనసులు హోల్ సేల్ గా దోచుకుంటున్న కరీంనగర్ కుర్రాడు “కిరణ్ బైరెడ్డి” అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా…. అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి…. విజయవాడలో “ఐ.సి.డబ్యూ.ఎ.ఐ” చేసి… లండన్ లో “ఎమ్.బి.ఎ” పట్టా పుచ్చుకుని… అక్కడ నాలుగన్నరేళ్లు కొన్ని కొలువులు చేసినా అతనికి కోరిన సంతృప్తి దొరకలేదు. “ఇక ఇక్కడ పొడిచింది చాల్లే” అని సొంతూరు వచ్చేశాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతని అర్ధాంగి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. “నీ మెంటాలిటీకి మోనోటనీగా ఉండే ఉద్యోగాలు సరిపడవులే” అంటూ ఫుల్ సపోర్ట్ చేసింది. లండన్ లో ఉండగా పరిచయం అయిన మిత్రుడి ఆహ్వానం మేరకు ఒకపరి…
ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సామాన్యుడు’కు మంచి ఆదరణ
విశాల్ యాక్షన్ థ్రిల్లర్ “సామాన్యుడు” కు తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.ZEE5 ప్రతి నెలా సినిమాలు మరియు ఒరిజినల్‌లను విడుదల చేస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది. తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో విశాల్…
