‘1996 ధర్మపురి’ చిత్రానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు : హీరో గగన్ విహారి

Dharmapuri-Hero

మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలలో విలన్ గా, సోదరుడుగా, స్నేహితుడుగా నటించి  ప్రేక్షకులలోను, పరిశ్రమలోను నటుడుగా మంచిపేరు తెచ్చుకున్న నటుడు గగన్ విహారి. తాజాగా  “1996 ధర్మపురి”చిత్రంతో.హీరోగా పరిచయ మయ్యాడు.శేఖర్ మాస్టర్ సమర్పణలో  భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన చిత్రం”1996 ధర్మపురి”. .ఓషో వెంకట్ సంగీతం ఆందించిన‌ ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 22 న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర హీరో గగన్ విహారి మీడియాతో మాట్లాడుతూ… నాకు యాక్టింగ్…

ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ‘రణస్థలి’ ఫస్ట్ లుక్ పోస్టర్

Ranasthali

సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం రణస్థలి ఫస్ట్ లుక్ పోస్టర్ డైరెక్టర్ క్రిష్ జాగార్లమూడి రిలీజ్ చేయటం జరిగింది, హీరో నాగశౌర్య నటించిన “అశ్వథ్థామ”సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరుశరాం  శ్రీనివాస్ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు నిర్మించిన చిత్రం “రణస్థలి”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయి వున్నారు, ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్‌ లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా “రణస్థలి” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయించడం జరిగింది..ఈ సందర్భంగా .. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్  మాట్లాడుతూ.. “రణస్థలి” సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్ కు…

‘సర్కారు వారి పాట’ ఓ విజువల్ ట్రీట్ : ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఇంటర్వ్యూ

Art-Director-Prakash-on-Sarkaru-Vaari-Paata-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలివి… డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ? -పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్,…

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సుమంత్ ‘అహం రీబూట్’ ఫస్ట్ లుక్

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సుమంత్ 'అహం రీబూట్' ఫస్ట్ లుక్

సుమంత్ హీరోగా న‌టిస్తున్న అహాం రీబూట్ ఫ‌స్ట్ లుక్ ని దేశం గ‌ర్వంచ‌ద‌గ్గ ర‌చ‌యిత విజయంద్ర ప్ర‌సాద్ గారు లాంఛ్ చేసారు. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్…సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సంద‌ర్బంగా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్ విన‌గానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా…

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆచార్య’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్‌ను అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి కుమార్తె.. రామ్ చ‌ర‌ణ్ అక్క సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు నిమిషాల పాటు సాగే ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్ చూస్తే అందులో శోభ‌న్ బాబుగా సంతోష్ శోభ‌న్‌.. శ్రీదేవిగా గౌరి జి కిష‌న్ క‌నిపించారు. సంతోష్ ఎక్కువ‌గా మాట్లాడే కుర్రాడిగా క‌నిపిస్తే హీరోయిన్ గౌరి షార్ట్ టెంపర్ ఉన్న అమ్మాయిగా క‌నిపించింది. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో హీరో,…

సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ నుండి ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియో విడుదల

Lyrical Video Of Golusu Kattu Gosalu Song From Suma Kanakala, Vijay Kumar Kalivarapu, Vennela Creations Jayamma Panchayathi Launched

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘జయమ్మ పంచాయితీ’ మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా చిత్రం యూనిట్ ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు. వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా వుందీ పాట. చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు. కథలో కీలకమైన…

బుద్ధి యజ్ఞమూర్తికి ‘పాత్రికేయ శిరోమ‌ణి’ పుర‌స్కార ప్ర‌దానం

బుద్ధి యజ్ఞమూర్తి కి 'పాత్రికేయ శిరోమ‌ణి' పుర‌స్కార ప్ర‌దానం...

ఏప్రిల్ 20-2022 రాత్రి ర‌వీంద్ర‌భార‌తిలో నేను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వ‌హిస్తోన్న కార్య‌క్ర‌మంలో పాత్రికేయ శిరోమ‌ణి పుర‌స్కారాన్ని అందుకున్నాను. అవార్డు క‌మిటీ చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీ ఫోన్‌చేసి, ఆ పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన‌ట్లు చెప్ప‌గానే, నిజంగా మొద‌ట ఆ పుర‌స్కారాన్ని అందుకోవ‌డానికి నేను అర్హుడ‌నేనా అనే ప్ర‌శ్న వెంట‌నే మ‌న‌సులో మెదిలింది. అంగీకారం తెల‌ప‌డానికి సందేహించాను. జ‌ర్న‌లిస్టుగా, ర‌చ‌యిత‌గా నా కెరీర్ ఎలా సాగుతూ వ‌చ్చిందో, నేనేం రాశానో, నేనేం సాధించానో 1993 నుంచీ ర‌ఫీకి చాలావ‌ర‌కు తెలుసు. ఆ విష‌యం అత‌ను చెప్ప‌గానే స‌రేన‌న్నాను. ఈ సంద‌ర్భంగా నేనేమిట‌న్న‌ది చాలావ‌ర‌కు తెలీని మిత్రులు, కొంతే తెలిసిన మిత్రులు చాలామందే ఉంటారు. వాళ్ల కోస‌మే ఈ నాలుగు (నాలుగంటే నాలుగు కాద‌నుకోండి) మాట‌లు… 22 సంవ‌త్స‌రాల వ‌య‌సులో.. 1993లో…

చిత్ర నిర్మాణ రంగంలోకి యువ గేయ రచయిత తైదల బాపు!!

చిత్ర నిర్మాణ రంగంలోకి యువ గేయ రచయిత తైదల బాపు!!

6 టీన్స్, ‘గర్ల్‌ఫ్రెండ్‌’,పటాస్,ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్‌, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్‌ శ్రీరాం, అధినేత, సెల్ఫీరాజా ఇలా దాదాపు 236 సినిమాల్లో దాదాపు 500కు పైగా సూపర్ హిట్  పాటలతో యువతను విపరీతంగా ఆకట్టుకుని.. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న యువ గేయ రచయిత తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్‌ 25. పచ్చని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పిన తైదల బాపు పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో 2022 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లోని సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన తైదల…

‘ధర్మస్థలి’ సక్సెస్ తో మా కష్టాన్ని మర్చిపోయాం : శకలక శంకర్

'ధర్మస్థలి' సక్సెస్ తో మా కష్టాన్ని మర్చిపోయాం : శకలక శంకర్

‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు రమణ మొగిలి బాగా తీశారు’’ అన్నారు శకలక శంకర్. పావని,భూపాల్ రాజ్, షాజీ షిండే ,మిర్చిమాధవి, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధర్మస్థలి’. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శకలక శంకర్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. రాజేంద్ర భరద్వాజ్ రాసిన మాటలు, వినోద్ యాజమాన్య చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఆడియెన్స్ నుంచి మచి స్పందన లభిస్తోంది ‘‘మౌత్‌ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా ‘ధర్మస్థలి’ సినిమా…

‘కళ్యాణమస్తు’లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

'కళ్యాణమస్తు'లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు. తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర.. సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.. నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర.. అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు. O. సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక…