By Sk.Zakeer, Editor, Bunker News : ”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని నిర్మించారు.ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఎంత శక్తివంతంగా మారిందో,కెసిఆర్ ఎదురులేని మనిషిగా ఎట్లా మారారో కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయపార్టీని స్థాపించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.ఇందుకు కారణం ఆయన ట్రాక్ రికార్డు.ఆయనకు ఉన్న నెట్ వర్క్. కనీసం ఐదారుగురు…
Category: FILM NEWS
ముస్లిమ్ సోదరులకు ఈద్-ముబారక్ : టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్
పవిత్రమైన రంజాన్ సందర్బంగా ముస్లిమ్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిములందరికీ ఈ రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైందని, చంద్రుడు కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు ముస్లిములలో చాలా మంది కఠినమైన నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించారని బొట్ల పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ అందరి జీవితాలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో…
‘దర్జా’ మూడో పాట విడుదల!
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్, టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్రంలోని మూడో పాటని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. పాట విడుదల అనంతరం నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘‘…
కన్నులపండువగా సినీ కార్మికోత్సవం!
కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు…
నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ‘ముత్తయ్య’ టీజర్ విడుదల
జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్. ఈ టీజర్ ను నేచురల్ స్టార్ నాని శనివారం విడుదల చేశారు. 24 ఏళ్ల వయసులో నాకు “అష్టా చమ్మా” సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది అంటూ స్పందించారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విశెస్ చెప్పారు. కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు.…
గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న శివనాగేశ్వరరావు ‘దోచేవారెవరురా..’
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మధ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్ తో సహా పలువురు నటీనటులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్. టెక్నికల్ టీమ్: బ్యానర్: IQ క్రియేషన్స్ దర్శకుడు: శివనాగేశ్వరరావు నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు PRO: లక్ష్మీ నివాస్
మే 6న శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’ విడుదల
ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె…
‘జయమ్మ పంచాయితీ’ వల్లే మేం నటులం అయ్యాం : దినేష్ కుమార్, షాలినీ
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీస . విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా యువ జంట దినేష్ కుమార్, షాలినీ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. దినేష్ కుమార్ మాట్లాడుతూ, నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. దర్శకుడిది మా ఊరే. బి.టెక్ చదివాక మదర్బోర్డ్ డిజైనర్గా జాబ్ చేశాను. కానీ చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక బలంగా వుండేది. – 8 ఏళ్ళుగా చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడంఅదృష్టంగా భావిస్తున్నాను.…
చిరంజీవి చేతుల మీదుగా ఫిలిం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ
-టి.ఎఫ్‌జె. తలపెడుతున్న సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ అవార్డు అందరికీ ఆదర్శం కావాలి : మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్‌జె.) సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ప్రధానం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్యూరెన్స్ సి.ఇ.ఓ. రాజేంద్ర, టి.ఎఫ్.జె. అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, జర్నలిస్టులంటే నా బంధువులతో వున్న ఫీలింగ్ కలుగుతుంది. నా కెరీర్ ఆరంభంలో `ప్రాణం ఖరీదు` సినిమా చేస్తున్నప్పుడు నా గురించి ఎవరైనా రాస్తే…
సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన వీడీ11 మూవీ టీమ్!!
స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా సమంత బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది. కెమెరా రోల్ అవుతూ హీరో హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్ డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్ లో ఉన్న వెన్నెల…
