హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘శేఖర్’ సినిమా టచ్ అవుతుంది : దర్శకురాలు జీవిత రాజశేఖర్

'Shekar' will touch everyone's hearts: Director Jeevitha Rajasekhar

By ఎం.డి అబ్దుల్ – టాలీవుడ్ టైమ్స్ కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్…

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘ఎఫ్3’ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట మే 17న విడుదల

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ - 'ఎఫ్3' నుండి పూజా హెగ్డే స్పెషల్ 'లైఫ్ అంటే ఇట్లా వుండాలా' పాట మే 17న విడుదల

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించబోతుంది. మే 17న విడుదల కానున్న ఎఫ్3 ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఈ పాట ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్‌ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్…

‘ఎఫ్3’లో నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ : సునీల్ ఇంటర్వ్యూ

'ఎఫ్3'లో నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ : సునీల్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్ బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘ఎఫ్ 3’ లో స్టార్ యాక్టర్…

రామ్ – లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘ది వారియర్’ మూవీ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్!!

రామ్ - లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్' మూవీ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్!!

సత్య… సత్య ఐపీఎస్! డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్. ఆయన అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్. వయలెంట్‌గా కొడతాడు! వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు! అతడి కథేంటో తెలియాలంటే… ముందు ‘ది వారియర్’ టీజర్ చూడాల్సిందే. సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. ‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్…

చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి : అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని

చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి : అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని

చిత్రపురి కాలనీ అభివృద్ధి పనులను అడ్డుపడొద్దని అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాలనీలోని కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేయడం, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. శనివారం చిత్రపురి కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమిటీ ట్రెజరర్ మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అలహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా … అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయ్యాం. అప్పటి నుంచి కాలనీ వాసులను విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. చిత్రపురికాలనీ హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. సొసైటీపై ఇప్పటికే 21 కేసులు కోర్టులో…

హైద‌రాబాద్‌ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో ‘గ్రే’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

హైద‌రాబాద్‌ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో 'గ్రే' మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందిన‌ చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోషన్స్‌లో భాగంగా `గ్రే` మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా… చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజు మాట్లాడుతూ – “ దాదాపు నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని తెలియ‌జేయ‌డానికి మా టీమ్ అంద‌రం ఎంతో గ‌ర్విస్తున్నాము. ట్రైల‌ర్ మీ…

శివకార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్

Actor Sivakarthikeyan starrer "DON" witnesses blockbuster opening

బ్లాక్ బస్టర్స్ కి పర్యాయపదంగా మారిపోయారు హీరో ‘శివ కార్తికేయన్’. ఈరోజు (మే 13, 2022) విడుదలైన శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. చిత్రానికి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడంతో నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్, హీరో-నిర్మాత శివకార్తికేయన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ లోకి రప్పించడానికి వేసవి సరైన సమయమని భావించిన నిర్మాతలు, ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నిర్మాతలు భావించినట్లే ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే భారీగా ఫ్యామిలీ…

‘ఎఫ్3’ చేయడం ఒక ఛాలెజింగా అనిపించింది : సోనాల్ చౌహాన్

actress Sonal-chouhan interview abupt F3 Telugu Movie

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్ లో నవ్వులు పండగ తీసుకురాబోతున్న ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ‘ఎఫ్3’తో పాటు తన పాత్రకు సంబధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్. 💐 ‘ఎఫ్ 3’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు…

టెర్రిఫిక్‌ సెకండ్‌ వీక్‌ కలెక్షన్ల వైపు ‘అశోకవనంలో అర్జునకల్యాణం’

Ashokavanamlo arjuna kalyanam

విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది అశోకవనంలో అర్జున కల్యాణం. రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. సిట్చువేషనల్‌ కామెడీ, లవ్‌ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం. సినిమా విడుదలై వారం రోజులు అయినా ఇంకా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. రెండో వారంలోనూ ఇన్ని మంచి థియేటర్లతో సినిమా రన్‌ అవుతుంటే మనసు నిండిపోయిందన్నది మేకర్స్ మాట. విశ్వక్‌సేన్‌ చేసిన హార్డ్ వర్క్ కి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల పంట పండుతోందని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.…

కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫస్ట్ సింగల్ ‘పతళ పతళ’ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్!

కమల్ హాసన్ 'విక్రమ్' ఫస్ట్ సింగల్ 'పతళ పతళ' పాటకు ట్రెమండస్ రెస్పాన్స్!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ ‘యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా ‘పతళ పతళ’ అనే పాటని ఇటివలే విడుదల చేశారు. ఈ పాటకు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మాస్, బాస్ నెంబర్ గా ఈ పాటని డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వుంది ‘పతళ పతళ’ సాంగ్. ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ మూవ్స్‌తో వింటేజ్ గ్రేస్‌…