– రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ – జూలై 1న విడుదల దెయ్యాలు అసలు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వస్తే? ఎప్పుడూ ఊహించని మలుపులతో ఆర్కా మీడియా, ఆహా సరికొత్త హారర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. భయానికి మరో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా చూడని ఒక సరికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మనందరి…
Category: FILM NEWS
ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక : హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: సుమంత్ అశ్విన్ గారూ… మీరు హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ విడుదలై జూలై 20కి పదేళ్లు. అలాగే, 30న మీ పుట్టినరోజు. మీ ప్రయాణం, కొత్త నిర్ణయాల గురించి… సుమంత్ అశ్విన్: నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి.…
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ : హీరోయిన్ మెహర్ చాహల్ ఇంటర్వ్యూ..
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించారు. ప్రశ్న: మీ గురించి చెప్పండి… మెహర్ చాహల్: నేను అస్సాంలో జన్మించాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. అందువల్ల, దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చివరకు, ముంబైలో సెటిల్ అయ్యా. వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులతో…
సురేఖమ్మ పాత్రకు న్యాయం చేశానని సుష్మితా పటేల్ మెచ్చుకున్నారు : ‘కొండా’ హీరోయిన్ ఇర్రా మోర్ ఇంటర్వ్యూ..
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ ఇర్రా మోర్! మీ గురించి చెప్పండి మాది ఆగ్రా, ఉత్తర ప్రదేశ్. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరుకున్నా. మొదట థియేటర్‌లో చేరాను. ఏడాదిన్నర పాటు హిందీ నాటకాల్లో పాత్రలు పోషించా. నార్త్ అంతా స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని చాలా ఆడిషన్స్ ఇచ్చా. రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీసుకు కూడా వెళ్లాను. ఆయన ‘భైరవగీత’ సినిమా…
అద్భుతమైన తెలుగు కంటెంట్ కలిగిన కొత్త 11 ఒరిజినల్ సిరీస్‌లను సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసిన ZEE5
ప్రస్తుతం తెలివిజన్ రంగంలో భారతదేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్ ZEE5, ZEE5 100+ టేస్ట్ క్లస్టర్‌లలో విభిన్నమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది మరియు నిజమైన, సంబంధిత మరియు ప్రతిధ్వనించే కథాంశాలపై దృష్టి సారించింది. ఈ రోజు, ZEE5 5 లక్షల+ గంటల కంటే ఎక్కువ డిమాండ్ కంటెంట్ మరియు 160+ లైవ్ టీవీ ఛానెల్‌లకు నిలయంగా ఉంది. 3500కి పైగా చలనచిత్రాలు, 1750 టీవీ కార్యక్రమాలు, 700 ఒరిజినల్‌లతో కూడిన గొప్ప లైబ్రరీతో ZEE5 12 భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ. ప్లాట్‌ఫారమ్ 2022 కోసం అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది, ఇది దాని విస్తృతమైన కంటెంట్ లైబ్రరీకి జోడిస్తుంది, వినోదం కోరుకునేవారికి విస్తృత శ్రేణి…
‘విరాట పర్వం’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా : సాయి పల్లవి ఇంటర్వ్యూ
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. సాయిపల్లవి పంచుకున్న విరాటపర్వం విశేషాలివి. సరళ గారి కుటుంబాన్ని కలవడం ఎలా అనిపించింది ? సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు. సరళకు జరిగిన అన్యాయం గురించి ఎలా ఫీలయ్యారు ? నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దిన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యాను. వెన్నెల పాత్రగానే చేశాను. వేణు ఊడుగుల కథ చెప్పినపుడు…
ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా : ‘7 డేస్ 6 నైట్స్’ హీరో రోహన్ ఇంటర్వ్యూ..
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రోహన్ మీడియాతో ముచ్చటించారు. ప్రశ్న: మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి? రోహన్: మా తల్లిదండ్రులు ఇద్దరిదీ గుంటూరు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ పైలట్. అందువల్ల, చిన్నతనం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగా. పాన్ ఇండియా చైల్డ్ అనుకోండి. హైదరాబాద్‌లోనూ చదివా. ఫ్రాన్స్‌లో స్కాలర్షిప్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ & రోబోటిక్స్‌లో బ్యాచిలర్…
కాలేజీ నుంచి రాజకీయ ప్రవేశం వరకూ… కొండా మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: మీరు ఇంతకు ముందు తీసిన కథలకు, ఈ కథకు వ్యత్యాసం ఏంటి? ‘కొండా’ సినిమా తీయడానికి మీకు స్ఫూర్తి ఏంటి? విజయవాడలో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది. నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు.…
‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్ ..జూన్ 24న గ్రాండ్ రిలీజ్
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్లూస్” అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు లక్షల లో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు దూల తీరపోద్ధిరా.. రే.. అనే డైలాగ్ ఉన్న ట్రైలర్ చూస్తుంటే చాలా హిలెరియస్ గా ఎగ్జైటింగ్ గా ఉంది. సాఫ్ట్ వేర్ లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా…
‘అంటే సుందరానికీ’ తీసినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నాం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నని
‘అంటే సుందరానికీ’ మాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన చిత్రం. మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ‘అంటే సుందరానికీ’ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం.” అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని. నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..’అంటే సుందరానికీ’ విజయం…
