పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా,సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటివలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూట్‌లో శ్వేత అవస్తి జాయిన్ కానున్నారు. ఈ చిత్రం క్లోసం వీరభద్రమ్ చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తోఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరికొంతమంది ప్రముఖ నటీనటులు…
Category: FILM NEWS
Swetha Avasthi To Play Lead Actress In Veerabhadram Chowdary, Naresh Agastya, Deccan Dream Works & Jayadurgadevi Multimedia’s New Movie
Talented director Veerabhadram Chowdary who directed several superhit movies like Poola Rangadu, Chuttalabbayi etc. will next be directing young hero Naresh Agastya of Mathu Vadalara and Senapathi fame in a new film which was announced recently. Nabishaik and Thumu Narsimha Patel will be producing the movie under Deccan Dream Works and Jayadurgadevi Multimedia banners. Latest update is the yet to be titled flick which is billed to be a crime comedy will feature Swetha Avasthi of Merise Merise fame playing the lead actress. The actress will join the shoot in…
జూలై 8న 500కి పైగా థియేటర్లలో ‘గంధర్వ’ విడుదల
జూలై 8న 500కి పైగా థియేటర్లలో గ్రాండ్ గా గంధర్వ రిలీజ్ కాబోతోంది. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో 500కి పైగా థియేటర్లను దక్కించుకోవడమే కాక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది గంధర్వ. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బెంగళూరు సహా ఓవర్సీస్ లో 500కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను…
శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ టీజర్ గ్రాండ్ గా విడుదల
హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉపశీర్షిక. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ’అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజర్ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు శ్రీవిష్ణు. నేరస్తులని వెంటాడటం, వారికి పోలీస్ పవర్ చూపించడం, నక్సల్ స్థావరానికి వెళ్లి ” ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజు” అని తనని తాను పరిచయం చేసుకొని తెగువ…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ విడుదల..దసరాకి థియేట్రికల్ రిలీజ్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా మార్వలెస్ గా వుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో ఎక్స్ టార్డినరీగా వుంది. ఒక కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్ లోకి ఫిరోషియస్ గా నడుచుకుంటూ వచ్చారు. గాడ్ ఫాదర్ టైటిల్ మెగాస్టార్ ఆహార్యాన్ని చక్కగా నప్పింది. ఈ గ్లింప్స్ వీడియోకి థమన్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా వుంది, పాత్రని…
దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సెకండ్ సింగిల్ ‘ఇంతందం’ లిరికల్ వీడియో విడుదల
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ టీజర్‌తో మ్యాజికల్ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్‌లో ఒకటిగా నిలుస్తుంది. మొదటి పాట ‘ఓహ్ సీతా హే రామా” సంగీత ప్రియులని అలరించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పాట- ఇంతందం ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హను రాఘవపూడి, మృణాళిని ఠాకూర్ , సంగీత విశాల్ చంద్రశేఖర్ , గేయ రచయిత కృష్ణకాంత్ పాల్గొన్నారు. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా…
మురళీ మోహన్ చేతులమీదుగా ‘అంతేనా..ఇంకేం కావాలి’ ప్రారంభం
అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా..ఇంకేం కావాలి”.పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా పరిచయం చేస్తూ హై బడ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ” ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ…
వెర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని సత్యదేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్…
రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ డిసెంబర్ 23న విడుదల
నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా వుంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్…
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం
హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. “సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు.
