ప్రతి సంవత్సరం, అల్లు అర్జున్ తన కార్యాలయంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు జరుపుతారు. గణేష్ చతుర్థి పండుగను తన సిబ్బందితో ఘనంగా జరుపుకుంటాడు. ఈ సంవత్సరం కూడా ఆ మాదిరిగానే గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు. అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నట్లు ఇటీవలి వీడియో వైరల్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని మరిచిపోలేదు. నిమజ్జన వేడుకలు నిమిత్తం రోడ్డుపైకి రావడానికి వెనుకాడలేదు. తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ పగలగొట్టాడు అల్లు అర్జున్. అలానే అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని మరియు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ప్రోత్సహించాడు.
Category: FILM NEWS
‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల
అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరోహీరోయిన్లుగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్ పతాకాలపై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం ‘నిన్నేపెళ్లాడతా’. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. ఆల్రెడీ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఈ టైటిల్‌తో కొత్త కథతో వస్తున్న టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు. చిత్ర నిర్మాత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన…
‘రహస్య’ చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీల్ అవుతారు : ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నివాస్
సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ “రహస్య” ఈ నెల 9 న గ్రాండ్ రిలీజ్ ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది. ఇలా ప్రతి మనిషి జీవితంలో మంచం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఒక మానవ జీవితంలో మనిషికి, మంచానికి ఉన్న రహస్య సంబంధం ఏమిటి ? అనే సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రమే “రహస్య”. SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.S ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9 న…
శర్వానంద్, కృష్ణ చైతన్య, రాశీ ఖన్నా, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నూతన చిత్రం వైభవంగా ప్రారంభం
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. నిర్మాతలు, చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. పవర్ ఫుల్ స్క్రిప్ట్…
కిచ్చా సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ సెప్టెంబర్ 16న విడుదల.. సినిమా కన్నుల పండగలా వుంటుంది : శ్రేయాస్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ…
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా నిర్మాతలు శ్రేయాస్ శ్రీనివాస్, సాయి కృష్ణ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… # ‘కే3 కోటికొక్కడు’ సినిమా గురించి ? –…
క్రైమ్ & లవ్ స్టోరీ ‘నీకై నేను’ ప్రారంభం
NGSP క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీ నటులుగా కృష్ణ కుమార్ అసూరి దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నీకై నేను”.ఈ చిత్ర ప్రారంభోత్సవం కార్యక్రమాలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ యస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ కుమార్ అసూరి మాట్లాడుతూ..” మా గురువుగారు డిస్నీ ఛైర్మెన్ ఎలన్ హార్న్, మరియు…
‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’ టైటిల్ టీజర్ విడుదల
అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. ఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేసారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ: అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ గారి నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా. చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని..చేస్తారని కోరుకుంటున్న అని అన్నారు. నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సునీల్ గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీ గా వుంది.…
PRESENTING THE EXCITING TRAILER OF STAR STUDIOS AND JUNGLEE PICTURES’ BABLI BOUNCER, RELEASING ON 23rd SEPTEMBER ON DISNEY+ HOTSTAR !
Directed by the National Award winning Director Madhur Bhandarkar, Babli Bouncer stars Pan India Actress Tamannaah Bhatia in a never seen before avatar! From the vision of National Award winning Director Madhur Bhandarkar who is known for his iconic onscreen characters, Babli Bouncer is a delightful fun family entertainer starring the popular youth icon & Pan India Actress Tamannaah as a lady bouncer! Produced by Star Studios and Junglee Pictures, Babli Bouncer is directed by Madhur Bhandarkar and stars Tamannaah Bhatia, in the lead along with Saurabh Shukla, Abhishek Bajaj…
తమన్నా ‘బబ్లీ బౌన్సర్’ ట్రైలర్ విడుదల
పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. ఈ చిత్రంలో తమన్నా లేడి బౌన్సర్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. నటి తమన్నా భాటియాను మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్నారు దర్శకుడు మధుర్. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా “బబ్లీ బౌన్సర్”చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం. ఈ ట్రైలర్ లో ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో తమన్నాను చూడవచ్చు. దర్శకుడు మధుర్ భండార్కర్ దృష్టిలో, తన ఐకానిక్ ఆన్‌స్క్రీన్ పాత్రలకు పేరుగాంచిన బాబ్లీ బౌన్సర్ ఒక సంతోషకరమైన సరదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇందులో ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా…
‘కంచర్ల’ షూటింగ్ ప్రారంభం!!
ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్‌పై కె. అచ్యుతరావు సమర్పణలో ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచర్ల. ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ…‘‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న…
