జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి స్మృత్యర్థం శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ప్రదానం చేసే విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ మలయాళీ కవి కె. సచ్చిదానందన్ ను ఎంపిక చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్ సి.నారాయణరెడ్డి 95వ జయంత్యుత్సవంలో సచ్చిదానందన్ ను 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక,ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు ట్రస్టు అధ్యక్షులు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక మలయాళ కవులలో అగ్రశ్రేణికి చెందిన సచ్చిదానందన్ కవిగా, సాహిత్య విమర్శకునిగా, నాటక కర్తగా, సంపాదకునిగా, కాలమిస్టుగా, అనువాదకునిగా ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బహుముఖీన సేవలు అందించారు. ఆయన కవితలు మలయాళం ఇతర భారతీయ భాషల్లో 18 సంపుటాలుగా వెలువడ్డాయి.…
Category: FILM NEWS
నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్ యజమాని మరియు నటుడు రాజారెడ్డి, తో పాటు శ్రీనివాస్‌రెడ్డిలు…
భాగ్యశ్రీ బోర్సే: సెన్సిటివ్ గర్ల్!
జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇలా పంచుకుంది… ”నేను చాలా సెన్సిటివ్. చిన్న విషయానికే వెంటనే ఎమోషనల్ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్ పవర్. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను. ప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్…
రావు బహదూర్ : బెస్ట్ ఓపెనింగ్స్!
మ్యాప్ మిరాకిల్స్ సత్యదేవ్ హీరోగా దీపా థామస్ హీరోయిన్ గా దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన అవైటెడ్ తెలుగు సినిమానే ‘రావు బహదూర్’. ఒక ఇంట్రెస్టింగ్ ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి వచ్చి ఒకింత మిక్స్డ్ టాక్ సంతరించుకుంది. అయినప్పటికీ డే 1 మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి రోజు రావు బహదూర్ ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు పిఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది మాత్రం సత్యదేవ్ కి అలాగే వెంకటేష్ మహాకి కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సినిమా పరిస్థితి స్టడీగానే ఉంది సో ఈ వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం…
‘Amba’s Revenge’ Set to Become Telugu Cinema’s First Full-Length AI Feature Film
▪️ First full-length AI-powered feature film in the Telugu film industry ▪️ Promotional campaign begins ahead of release Hyderabad: Marking a significant technological milestone in Telugu cinema, Amba’s Revenge is gearing up for release as the industry’s first full-length feature film created with the support of Artificial Intelligence (AI). Produced by Yogendra Potluri and Rani Madison under the Nakka Thoka Films banner, the film is directed by Jayavardhan Madi. The AI Visual Design & Development is being handled by Kalai Visual Studios. With its title poster officially unveiled, the makers…
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ
ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా చాటింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత వాలీబాల్ జట్టు మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇది దేశంలో వాలీబాల్ ఆటకు మరింత ఆదరణ తీసుకురానుంది. భారత వాలీబాల్ జట్టు ఈ అద్భుత విజయం సాధించడం వెనక పలు నగరాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ఫ్రాంఛైజీలు, ఆ ఫ్రాంఛైజీలతో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాంటి ఫ్రాంఛైజీలలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కూడా కీలక జట్టుగా పోటీ పడుతోంది. హైదరాబాద్…
‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం
అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఉదయ్ గుర్రాల కెమెరామెన్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. ఈ మూవీ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్‌మెన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నాను. దీన్ని ఎలాంటి ఉద్యోగం అనాలో కూడా నాకు తెలీడం లేదు. ఉరి తీసే వ్యక్తి…
తమ్మారెడ్డి భరద్వాజకు ఫిలింక్రిటిక్స్ శుభాకాంక్షలు
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి వారు, చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే నాయకత్వ లక్షణాలున్న తమ్మారెడ్డి భరద్వాజ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అధ్యక్షడు బత్తుల జె.వి. ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, సీనియర్ జర్నలిస్టు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడి పల్లి గిరిధర్ లు ఆయన నివాస స్థలానికి వెళ్ళి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఫిలిక్రిటిక్స్ కొత్త నాయకత్వం బాగా పని చేస్తున్నారని ..త్వరలో మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి తాను రావడానికి సుముఖంగా ఉన్నానని ఆయన అన్నారు.
ఆ నలుగురే స్ఫూర్తి దాతలు : ఫిలిం క్రిటిక్స్ ‘మీట్ ది ప్రెస్’లో మురళీమోహన్
మాగంటి మురళీ మోహన్ … తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే ప్రేక్షకులకు పరిచయం. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. హీరోగా, సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆయనను బాగా ఆదరించారు. చిన్న నిర్మాతల హీరోగా…
సినికేథన్ 2026 వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు భారత క్రియేటివ్ ఎకానమీ కి జాతీయ స్థాయి ఏకీకృత వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను అధికారికంగా ప్రారంభించారు. భారతీయ ఫిల్మ్ , మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా CCO ఆవిర్భావం చారిత్రాత్మక ముందడుగు. CCO లక్ష్యం: డైరెక్షన్ , రైటింగ్ , యాక్టింగ్ , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , మ్యూజిక్& సౌండ్ , ఆర్ట్ డైరెక్షన్& ప్రొడక్షన్ డిజైన్ , వీఎఫ్స్ /అనిమేషన్& డిజిటల్ కంటెంట్ , ప్రొడ్యూసింగ్ వంటి సినీ రంగంలోని తొమ్మిది ప్రధాన క్రాఫ్ట్స్‌కు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం. పరస్పర సహకారం, ప్రొఫెషనల్…
