‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో.. నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’ చేశాక నేను దేవుడ్ని ఏదీ అడిగింది లేదు. కానీ తిరుపతిలో ఈవెంట్ అయ్యాక..…
Category: FILM NEWS
ఆ దివ్యాంగురాలిని ఆదుకుంటాను : చదలవాడ శ్రీనివాసరావు
ప్రకృతి వల్ల కలిగిన విపత్తులలోనే కాకుండా ఇలాంటి సందర్భంలో కూడా మనుషులు మానవతా దృక్పదంతో ఆలోచించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోరాజ్ కుమార్ అనే ప్రబుద్దుడు తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు తనపై కేసుపెట్టిన మైనర్ బాలిక..ఆమె తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ .. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేంత దారుణమైనది. సమాజం ఆధునికంగా ఎంతో ముందుకు వెళుతున్నా ఇలాంటి ఆటవిక చర్యలు ..మాత్రం ఆగడంలేదు. మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అంతు చిక్కడం లేదు. ఈ పాశవిక చర్య నా మనసును తీవ్రంగా భాదించింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అనే ది అస్సలు అర్థం కావడంలేదు.…
‘లెనిన్’ రూపంలో అఖిల్ కల నెరవేరింది : బ్లాక్ బస్టర్ మీట్ లో కింగ్ నాగార్జున
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే రూ.16.7 కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శనివారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో నాగ్ అఖిల్ సక్సెస్ చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. అఖిల్ హిట్ కోసం తాను దేవుడిని ఎలా వేడుకున్నారో చెప్పడంతో పాటు, ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు, అలాగే ఫ్యాన్స్ స్లోగన్ అందుకుంటూ వేదికపై నాగార్జున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ విశేషాలు చూద్దాం.. అఖిల్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ‘లెనిన్’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ స్టామినా…
‘లెనిన్’ ఫలితంతో భావోద్వేగానికి లోనైన భాగ్యశ్రీ!
ఎన్నో ఆటు పోట్లు తర్వాత వచ్చే విజయం అది ఇచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీల్ లోనే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఆమె కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు వరకు చేసిన సినిమాలు కొన్నే కానీ ఆమెకి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. గట్టి విజయం మాత్రం దక్కలేదు. అయితే దానిని ఇపుడు ‘లెనిన్’ రూపంలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అందించారు. అఖిల్ తో చేసిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా సాలిడ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. దీనితో మేకర్స్ ఏర్పాటు చేసిన బ్లాక్ బస్టర్ మీట్ లో భాగ్యశ్రీ చాలా భావోద్వేగానికి లోనైంది. దర్శకుడికి మొదటిగా థాంక్స్ చెబుతూ ఆమె హైదరాబాద్ ని…
మురళీమోహన్ కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సత్కారం
భారత ప్రభుత్వం నుండి తనకు పద్మశ్రీ పురస్కారం అందిన సందర్భంగా ప్రఖ్యాత సినీ నటులు మాగంటి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాని శనివారం లోక్ భవన్ లో కలిసారు. ఈ సందర్బంగా మురళీమోహన్ ని గవర్నర్ అభినందించి సత్కరించారు. చిత్రంలో కుటుంబ సభ్యులు రూపా మాగంటి, బి.యస్.రావు కూడా ఉన్నారు.
‘ఓ..! సుకుమారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
దామిని గురించి ఊరంతా భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే… ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సమస్యను భార్యాభర్తలు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అన్నదే ‘ఓ..! సుకుమారి’ సినిమా ప్రధాన కథాంశం. టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, ‘శివం భాజే’ విజయం తర్వాత గంగా…
వైభవంగా ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభం
పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్.కె. దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా హీరో లోమేష్ పూడిపెద్ది, హీరోయిన్ జయశ్రీ, తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు, దర్శకుడు విజయ్ కనకమేడల,…
స్పెషల్ స్టోరీ…యాక్షన్ మోడ్ లో టాప్ హీరోలు!
టాలీవుడ్ లో ప్రస్తుతం మన స్టార్ హీరోలు అంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో యమ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య కూడా ఒకరు. అయితే ఈ ముగ్గురూ తమ భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా.. ఈ ముగ్గురూ కూడా తమ సినిమాలతో యాక్షన్ మోడ్ లో ఎంతో హుషారుగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేసేలా…
‘హృదయం మురళి’ అందరికీ రిలేట్ అయ్యే సినిమా : ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా
అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ చాలా అద్భుతం. నా గత చిత్రాలకు ఎంతో ప్రేమను అందించారు. ‘హృదయం మురళి’ స్పెషల్ సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాను…
ఘనంగా మహేష్ కాంపెల్లి ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ విడుదల
మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. “ది పాయింట్ ఆఫ్ వ్యూ” అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా… నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. “మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో…
