దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ. “కౌశిక వర్మ దమయంతి”. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలో హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతులమీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా.. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “కౌశిక వర్మ దమయంతి సినిమాకు యస్. యస్ ఆత్రేయ…
Category: FILM NEWS
శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్టోబర్ 25 దీపావళితో లాంగ్ వీకెండ్‌ను ప్రిన్స్ క్యాష్ చేసుకోనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయి ప్రేమ కథ, వారి ప్రేమ కథలోని సమస్యల హిలేరియస్ గా ట్రైలర్ ప్రజంట్ చేసింది. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ఇద్దరూ ఒక పాఠశాలలో పని చేస్తుంటారు. శివకార్తికేయన్ తండ్రిగా సత్యరాజ్ ఒక సంఘ సంస్కర్త, తను ప్రేమకి ఆమోదాన్ని తెలిపినప్పటికీ, ప్రేమకథకు మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి. అనుదీప్ కెవి విభిన్నమైన రోమ్-కామ్‌ని ఎంచుకుని, దానిని తన శైలిలో ప్రజంట్ చేశాడు. ట్రైలర్‌లో…
‘స్వాతిముత్యం’తో గణేష్ ని హీరోగా ఆదరించడం ఆనందంగా వుంది : బెల్లం కొండ సురేష్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత. బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. నూతన దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా .. నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రానికి అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది. పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” తెలిపారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘స్వాతిముత్యం’తో రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య స్వాతిముత్యం చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రసంశించడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ, చినబాబు గారికి కృతజ్ఞతలు” తెలిపారు. దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ మాట్లాడుతూ.. స్వాతిముత్యంను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బెల్లం కొండ సురేష్ గారు నాపై ఎంతో నమ్మకం వుంచి, నన్ను మొదటి నుండి ఎంతో ప్రోత్సహించారు. మా నిర్మాతలు వంశీ అన్న, చినబాబు గారికి కృతజ్ఞతలు. రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా స్వాతిముత్యం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఫోన్ పే కో ఫౌండర్లు ముంబై ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 2022లో నిర్వహించిన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా తమ కుటుంబాన్ని విస్తరించుకోవడానికి సిద్ధమైంది. భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్ధాపకులు ఇప్పుడు ఈ లీగ్‌లో మదుపరులుగా వచ్చి చేరారు. ఈ పీవీఎల్‌లో వారు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా 8వ ఫ్రాంచైజీ– ముంబై మీటార్స్‌ను సొంతం చేసుకున్నారు. పూర్వ భారత వాలీబాల్ టీమ్ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారు. ఈ సందర్భంగా సమీర్ నిగమ్ మాట్లాడుతూ ‘‘ నా వరకూ తరచుగా వాలీబాల్ ఆడే…
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 15న రిషబ్ శెట్టి “కాంతారా” విడుదల
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’ తీశారు. మూడో సినిమాగా పునీత్ తో తీసిన ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై చరిత్ర మొదలైంది. యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్’ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కెజిఎఫ్2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్…
Allu Aravind Releasing Rishab Shetty’s Divine Blockbuster Kantara in Telugu on OCT 15
Hombale Films, founded by Vijay Kiragandur, touched unprecedented heights in the last decade. With the film KGF, Hombale Films gained recognition as a leading production company at the national level. Still Hombale films backs stories rooted in the local milieu and caters to the common man. Kantara is the latest film from the collaboration of Hombale Films and Rishab Shetty. On September 30th, the film was released in Kannada and received a tremendous response. The film is regarded as a Divine blockbuster, providing audiences with a magical experience in theatres.…
‘నువ్వే నువ్వే’కు 20 ఏళ్ళు!
త్రివిక్రమ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నువ్వే నువ్వే’కు 20 ఏళ్ళు! అమ్మ… ఆవకాయ్… అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు! – ‘నువ్వే నువ్వే’ సినిమాలో ఓ డైలాగ్. అమ్మ, ఆవకాయ్, అంజలి మాత్రమే కాదు… ‘నువ్వే నువ్వే’ కూడా ఎప్పుడూ బోర్ కొట్టదు! – ఇది ప్రేక్షకులు చెప్పే డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి (ఈ నెల 10వ తేదీకి) ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు. కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు…
నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి : బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘గాడ్ ఫాదర్’ కు ప్రపంచం నలుమూలల నుండి…
అక్టోబర్ 14న వస్తున్న ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా..’
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”.ఈ చిత్రం నుండి విడుదల చేసిన “నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతంతో పాటు విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం. ఆర్. సి. వడ్ల పట్ల ,నిర్మాతలు సి. హెచ్ వి.…
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నుండి టైటిల్ సాంగ్ వీడియో విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, ట్యాలెంటడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీజర్, ఆసక్తికరమైన పోస్టర్‌లతో ట్రెమండస్ బజ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా టైటిల్ ట్రాక్ వీడియోతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు నిర్మాతలు. లైక్ షేర్ & సబ్స్క్రయిబ్ టైటిల్ ట్రాక్ లో తన వ్లాగ్ కోసం కంటెంట్‌ను సిద్ధం చేయడంలో ఫరియా అబ్దుల్లా బిజీగా వుండగా..సంతోష్ శోభన్ తన ప్రేమను తెలియజేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఫరియా తన ఫాలోవర్స్ ని ఛానెల్‌ని లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చేయమని కోరగా, సంతోష్ తన ప్రేమని అంగీకరించమని కోరడం క్యూరియాసిటీని పెంచింది. ప్రవీణ్ లక్కరాజు ఫ్రెస్ అండ్ ఫ్లజంట్ ట్యూన్ ని కంపోజ్ చేయగా, స్వీకర్ అగస్తీ తన బ్రిలియంట్ వాయిస్…
