Meghamsh Srihari, son of the late Real Star Srihari, is playing the lead role in the upcoming film Student. Vijeta Pareek stars as the female lead. The film is being produced by Bellam Siddareddy under the banners of Jovika Cinemas and Cherish Media Works, while Balu Tatvamasi is directing the project. Bellam Sangeetha and Bellam Bayyareddy are serving as co-producers. The film is gearing up for its theatrical release, and the makers have now unveiled its official teaser. The teaser introduces Bhanu, played by Meghamsh Srihari, as a carefree college…
Category: FILM NEWS
ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : గురువు భాగ్యరాజాపై చిన్నికృష్ణ భావోద్వేగ వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మృతి పట్ల ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు మాటలు రావడం లేదు’ అంటూ తన గురువు భాగ్యరాజాపై ఉన్న గురుభక్తిని చాటుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక్క ఫ్లాప్ కూడా లేని నెంబర్ వన్ రైటర్‌గా తాను నిలబడటానికి గురువు భాగ్యరాజా గారి శిష్యరికమే కారణమని చిన్నికృష్ణ స్పష్టం చేశారు. దర్శకత్వం చేయాలనే సంకల్పంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిన్ని కృష్ణ తొలుత రచయితగా మారాల్సి వచ్చింది. నరసింహనాయుడు, నరసింహ, ఇంద్ర, గంగోత్రి వంటి విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన ఆయన రచయితగా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్లు…
‘హే చికీతా’ చిత్రం పెద్ద విజయం సాధించాలి : టీజర్ లాంచ్ ఈవెంట్ లో సి.కళ్యాణ్
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ఈ మూవీకి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, ప్రముఖ దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘అంజి నా శిష్యుడు. అతనికి…
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు.. సంగీత దర్శకుడిగా సింగర్‌గా కూడా ఆయన అలరించారు. కె.భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక,…
‘రావు బహదూర్’ ఒక సర్రియల్ సినిమా… ఇండియన్ సినిమా ఇలాంటి చిత్రాన్ని ఇప్పటివరకు చూడలేదు : సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్
సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రెజెంటర్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కూడా స్పెషల్ ప్రివ్యూ చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. జూలై 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. సుకుమార్ మాట్లాడుతూ..”రావు బహదూర్ ఒక సర్రియల్ సినిమా. భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక మ్యాజికల్, ఇమర్సివ్ సినీ అనుభూతిని అందించే చిత్రం. ప్రేక్షకులను ప్రతి క్షణం ఆశ్చర్యపరుస్తుంది” సత్యదేవ్ నటన గురించి మాట్లాడుతూ ” ఒక నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుంది.…
మౌర్య-తన్వి హీరో హీరోయిన్లుగా ‘జోకర్’ ప్రారంభం
మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘జోకర్’. ఈ సినిమా శనివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా… నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్లో రూపొందుతున్న జోకర్ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్. డైరెక్టర్ గీత సి.శేఖర్ ఫన్ ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోషనల్ టచ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య, తన్వి జోడీ క్యూట్‌గా మెప్పించనున్నారు. ఆగస్ట్ నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం.…
Happy birthday Narayanarajugaaru
Happy birthday Narayanarajugaaru
Raj Dasireddy Visits Iconic Luxury Brand Louis Vuitton
Actor Raj Dasireddy, best known for Maruthi’s Bhadram Be Careful, recently visited the Hyderabad boutique of the globally acclaimed luxury fashion house Louis Vuitton. Sharing his excitement, Raj said it was a memorable experience to explore one of the world’s most prestigious fashion brands, renowned for its exquisite handbags, footwear, jewellery, and premium lifestyle accessories. Established 172 years ago, Louis Vuitton has earned an enduring reputation as one of the most luxurious and influential fashion brands in the world. Its products are regarded as symbols of elegance, exclusivity, and prestige,…
‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి!!
మారుతి “భద్రం బి కేర్ ఫుల్” ఫేమ్ రాజ్ దాసిరెడ్డి… ప్రపంచప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ “లూయిస్ వ్యూట్టన్’లో సందడి చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, షూస్ మొదలుకుని జ్యువెలరీ వరకు పలు రకాల అలంకార ఉత్పత్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన “లూయిస్ వ్యూట్టన్’, హైదరాబాద్ స్టోర్ ను సందర్శించడం తనకెంతో సంతోషానించ్చిందని దాసిరెడ్డి పేర్కొన్నారు. 172 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన “లూయిస్ వ్యూట్టన్’ అనేక పర్యాయాలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. “లూయిస్ వ్యూట్టన్’ ప్రోడక్ట్ ధరించడాన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం గర్వంగా, ప్రత్యేకంగా ఫీలవుతుంటారు. రాజ్ దాసిరెడ్డి తదుపరి చిత్రం త్వరలో అనౌన్స్ కాకుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది!!
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ విడుదల తేదీ ఖరారు..
అక్టోబర్ 2న వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47” విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. ఈ చిత్రం భావోద్వేగాలు,…
