(చిత్రం: స్పార్క్, నటీనటులు : రేటింగ్ : 3.5/5, విక్రాంత్ రెడ్డి , మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. దర్శకత్వం : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, నిర్మాత : లీలా రెడ్డి, సంగీత : హేషమ్ అబ్దుల్ వాహాబ్ , సినిమాటోగ్రఫీ : ఏ.ఆర్.అశోక్ కుమార్). ఈ దీపావళి కానుకగా అనేక చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. అలా విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా సందడి చేసింది లేదు. ఫలితంగా రాబోయే సినిమాల మీద ప్రేక్షకులు దృష్టిసారించారు. అలా ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి ఈ వారం ‘స్పార్క్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వచ్చిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం…
Category: Entertainment
నాకు అవకాశం ఇవ్వమని ఆయన వెంటపడ్డా… : పాయల్ రాజ్‌పుత్ ఇంటర్వ్యూ…
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మీరు నటించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా మొదలైంది? ‘సార్… నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి’ అని అజయ్ భూపతి వెంట పడ్డాను.…
‘కోటబొమ్మాళి పీఎస్’ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది : శివాని రాజశేఖర్ ఇంటర్వ్యూ …
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… ఈ ప్రాజెక్టులో మీరు ఎలా భాగమయ్యారు? -‘ఆర్టికల్ 15’ తమిళ్ రీమేక్ లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయి పాత్ర పోషించాను. ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ…
నాకు కత్రీనాకైఫ్ కు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం : సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏదీ కూడా దీపావళికి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనుంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. దీపావళికి ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దీపావళి పండుగకి సినిమా రిలీజ్ కావటం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆరోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే…
విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి వేడుకలో రష్మిక మందన్న!?
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ పెయిర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో వీరిద్దరూ మళ్లీ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. వీళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అయితే అన్‌స్క్రీన్‌లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్‌లోనూ వీళ్లు చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు. అయితే గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో…
సలార్, క్రేజీఎఫ్‌కు లింకు..!
‘సలార్’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలని మరింతగా పెంచేస్తూ.. ఈ చిత్రంపై ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ రూమర్ వినిపిస్తుంది. సలార్, క్రేజీఎఫ్‌కి లింక్ వుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. టీజర్ లో కూడా కొన్ని పోలికలు కనిపించాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ యూనివర్స్ తో ముడిపెడుతూ ‘సలార్’ కథని రాసుకున్నారని వినిపించింది. అయితే ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఇక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్’ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ ట్రైలర్ టైంకి.. కేజీఎఫ్2 క్లైమాక్స్‌కి ఓ సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఒక విషయం…
Nikhil is going to be a father soon! : నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు!
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ అభిమానులకు గుడ్ న్యూస్. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నిఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కోవిడ్ టైంలో వీరి పెళ్లి కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్…
అజయ్ భూపతి ‘మంగళవారం’ కథ చెప్పినప్పుడు ఇటువంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలనిపించింది, ఇందులో బోల్డ్ విషయం ఉంది – ప్రీ రిలీజ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత ఆయన తీసిన చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మించింది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా… శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ…
‘భగవంత్ కేసరి’ చిరస్థాయిగా నిలిచిపోతుంది : ‘బాక్సాఫీస్ కాషేర్’ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ
బాలయ్య బాబుకి సీజన్ తో సంబంధం లేదు. ‘భగవంత్ కేసరి’ వెలుగుతూనే వుంటుంది: దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ‘భగవంత్ కేసరి’ నా కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచింది: దర్శకుడు అనిల్ రావిపూడి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్…
ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’ : దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్
హన్సిక లీడ్ రోల్‌లో ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెండ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ ‘మై నేమ్ ఈజ్ శృతి’ గురించి చెప్పిన విశేషాలు.. “పలు చిత్రాలకు రైటర్‌గా వర్క్ చేసిన నేను.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ చిత్రం ఉద్దేశం. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా ఇది. ప్రతి ఒక్కరి జీవితం ఆడవాళ్ళతో ముడిపడి ఉంటుంది. అలాంటి ఆడవారికి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఆర్గాన్ మాఫియా బ్యాక్…
