టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబిరెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్ 12న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ…
Category: Entertainment
తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషీకపూర్!
బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అలనాటి తార దివంగత నటి శ్రీదేవి. అదే తరహాలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ది ఆర్చీస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా…
హృతిక్ రోషన్ లుక్ అదుర్స్!
హృతిక్ రోషన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’ .. వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా వయాకామ్ 18 స్టూడియోస్`మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హృతిక్ లుక్‌ను, క్యారెక్టర్ డిటెయిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హాలీవుడ్ చిత్రం టాప్ గన్ తరహాలో మన దేశం నుంచి మొట్టమొదటి సారిగా ఎవియేషన్ జానర్‌లో రూపొందుతున్న ఈసినిమాలో ఆయన ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా అనే స్క్వాడ్రన్ పైలట్ పాత్రలో కనిపించబోతున్నాడు.
నేనలా మాట్లాడలేదంటోంది కృతి సనన్!
జాతీయ పురస్కార గ్రహీత కృతి సనన్ ట్రేడింగ్ మాధ్యమాలను సపోర్ట్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! బాలీవుడ్ టాక్‌షో ‘కాఫీ విత కరణ్’లో ఆమె ట్రేడింగ్ మాధ్యమాలను ప్రోత్సహించారని పలు కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇస్తూ కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘కొన్ని విూడియా సంస్థలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉందని రాశారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. మిమి చిత్రం తన నటనకుగానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది జాతీయ…
‘హరోం హర’ నన్ను మలుపు తిప్పింది !
‘మామామశ్చీంద్ర’ తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలవగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 7 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో నిలిచి..సుధీర్‌బాబు ఈసారి తప్పనిసరిగా భారీ హిట్ కొడుతాడనే నమ్మకాన్ని ఇచ్చింది. ఈక్రమంలో టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి మీడియాతో చిట్‌చాట్ చేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు గతంలో ‘సెహరి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రెడ్, నేల టికెట్టు’ సినిమాల్లో కథానాయికగా చేసిన మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, డైరెక్టర్ నన్ను సరికొత్తగా…
శ్రీలంకలో హీరో యష్ ఏం చేశాడంటే…?
యష్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు సినిమా టైటిల్ ప్రకటన! ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు కన్నడ హీరో యష్. ‘కేజీఎఫ్`2’ తర్వాత ఆయన తదుపరి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. ‘యష్`19’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అప్‌డేట్‌ను అందించారు యష్. డిసెంబర్ 8న ఈ సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి వివరాలను యష్ వెల్లడించనప్పటికీ.. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వ బాధ్యతలను తీసుకోనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా లొకేషన్ సెర్చ్ కోసం యష్ శ్రీలంకలో పర్యటిస్తున్నట్లు సమాచారం.
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఇంటికి వెళ్లిన నాని
టాలీవుడ్ మూవీ లవర్స్‌తోపాటు నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ (డెబ్యూ డైరెక్టర్) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. నాని 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని అండ్ టీం ఇప్పటికే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అభిమానులతో సెషన్‌లో కూడా పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై ఫోకస్ పెట్టాడు నాని. ఇందులో భాగంగానే కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ఇంటికెళ్లాడు. ఈ ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ టైంలో ‘హాయ్ నాన్న’ సినిమాలతోపాటు పలు విషయాలపై చర్చించారు. ఇప్పుడీ స్టిల్స్…
వైరల్ అవుతోన్న నితిన్, సిద్దు జొన్నలగడ్డ ఫన్ ఇంటర్వ్యూ..
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నితిన్, వంశీ అండ్ శ్రీలీల టీం ఇప్పటికే ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డతో ఫన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నితిన్. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూ ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలతోపాటు టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్…
Green Gold Group Ventures entered the film production under the banner of Chilaka Productions. Ace producers Allu Aravind and Sharat Marar unveiled the banner logo
Green Gold Group, a leading company in the field of world animation, has now taken another step. This company entered the film production with the banner named Chilaka Productions. This banner logo was unveiled by ace producer Allu Aravind and Sharat Marar. Having excelled in the field of animation for more than two decades, Green Gold Group has earned a unique recognition. It impressed everyone with programs like Bang Vikram Bethal, The Krishna and Chhota Bheem in channels like Cartoon Network, Pogo and Disney XD. Since 2010, this company has…
‘హరోం హర’ నా కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుంది: టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటివలే తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘హరోం హర’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నేషనల్ వైడ్ గా టీజర్ వైరల్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో వుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. నా జీవితంలో నేను ఏం సాధించినా అది సూపర్ స్టార్ కృష్ణ గారి గిఫ్ట్. ఆయన ఆశీస్సులు నాకు…
