Mr. Bachchan movie Review in Telugu : ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ : స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్

Mr. Bachchan movie Review in Telugu

(చిత్రం : ‘మిస్టర్ బచ్చన్’ , విడుదల తేదీ : ఆగస్టు 15, 2024, మొబైల్ మసాలా రేటింగ్ : 2. 25/5, నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు. దర్శకత్వం : హరీశ్ శంకర్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్, సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: అయానక బోసే, ఎడిట‌ర్ : ఉజ్వల్ కులకర్ణి) మాస్ మహారాజ్ రవితేజ – స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని…

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం రామ్‌ ఫీట్లు..

Ram Feet for 'Double Smart'..

థియేటర్లలో మాస్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయాలంటే హీరో ఏదో ఒక రిస్కీ ఫీట్‌ చేయాల్సిందే. మూవీ లవర్స్‌ కోసం అలాంటి రిస్క్‌ చేసే యాక్టర్లలో ఒకడు రామ్‌ పోతినేని. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ నటించిన చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌… బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్‌ ఇస్మార్ట్‌ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ టీం ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులు, సినీ జనాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా కోసం బాలీ (ఇండోనేషియా)కి వెళ్లి తక్కువ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో 18 కిలోలు బరువు తగ్గానని చెప్పాడు రామ్‌. కాగా ఈ మూవీలో…

స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ : బన్నీ వాసు భావోద్వేగం

Allu Arjun is the person who brings friendship to life: Bunny Vasu is emotional

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్‌ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ‘ఆయ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే.. రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్‌. ‘ఆయ్‌’ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని పోస్ట్‌ పెట్టమని అడగాలని మా టీమ్‌ వాళ్లు కోరారు. కానీ, నేను ఆయన్ను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్‌లో ఈ చిత్రం గురించి పోస్ట్‌ చేశారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా…

ప్రభాస్‌ సినిమాలో నేను లేను: మృణాల్‌ ఠాకూర్‌

I am not in Prabhas' movie: Mrinal Thakur

వరుస విజయాలతో జోష్‌ విూదున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్‌తో మృణాల్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. ’ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్‌’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై మృణాల్‌ స్పందించారు.’విూ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని కామెంట్‌ చేశారు. దీంతో రూమర్‌కు చెక్‌ పడింది. మరి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు కనిపిస్తారో అనే చర్చ మరోసారి మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం రానుంది.…

ఎన్టీఆర్‌కు గాయాలంటూ ప్రచారం… క్షేమంగానే ఉన్నారంటూ స్పష్టీకరణ!

Propaganda that NTR is injured... Clarification that he is fine!

ప్రముఖ హీరో ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలయ్యాలంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై నటుడి టీమ్‌ స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ‘జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మకండి’ అని విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం చోటుచేసుకుందని, నటుడికి గాయాలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరగ్గా టీమ్‌ రియాక్ట్‌ అయింది.

యశ్‌ ‘టాక్సిస్‌’లోకి అక్షయ్‌ ఒబెరాయ్‌ఎంట్రీ ..

Akshay Oberoi's entry in Yash's Taxis

యశ్‌ హీరోగా మళయాల దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ ‘టాక్సిక్‌’ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఒబెరాయ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్‌ పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ మూవీ యూనిట్‌ పంపిన లెటర్‌ను షేర్‌ చేశారు. ‘విూలాంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేసేందుకు ‘టాక్సిక్‌’ టీమ్‌ ఆసక్తిగా ఉంది’ అంటూ అక్షయ్‌ను ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది మూవీ యూనిట్‌. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఇందులోని నటీనటులు గురించి వెల్లడించలేదు. మొదటిసారి అక్షయ్‌ భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్‌ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఏడాదిలో అక్షయ్‌.. ‘టాక్సిక్‌’తో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రమిది. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల…

‘ఆదిపురుష్‌’ పరాజయంతో ఏడ్చేశా : నటి కృతి సనన్‌

Cried after 'Aadipurush' debacle: Actress Kriti Sanon

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్‌’ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌ రాధేశ్యామ్‌ తర్వాత మరో డిజాస్టార్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా స్పందించింది నటి కృతి సనన్‌. ఆదిపురుష్‌ ప్లాప్‌ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయం అయితే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. కొన్నిసార్లు ఏడ్చేస్తాం. అయితే ఈ తప్పు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం అనేది మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్ట్‌ వెనుక ఉద్దేశం పాజిటివ్‌గానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అది కొందరికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా ఈ అనుభవాల నుండి మనం చాలా నేర్చుకుంటాం. ఒక నటిగా నేను ఎప్పుడు పాజిటివ్‌గా ముందుకెళ్లాలి.…

ఆయ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్

I want Ai' to be a big hit: Hero Nikhil at pre-release event

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాను ఆగస్ట్ 15న సాయంత్రం రిలీజ్ చేయబోతోన్నాం. మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్, శ్రీలీల గారికి థాంక్స్. కొడితే పది మంది కింద పడే కథ కాదు కదా? అని అడిగాను. ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం…

“I want ‘AAY’ to become a big hit”: Nikhil Siddhartha at pre-release event

"I want 'AAY' to become a big hit": Nikhil Siddhartha at pre-release event

Narne Nithiin and Nayan Sarika are the lead actors in the film AAY, which is produced by Bunny Vas and Vidya Koppineedi under the banner of GA2 Pictures and presented by Allu Aravind. The film is directed by Anji K Maniputhra and will have a grand release on August 15. A pre-release event was held on Tuesday, with hero Nikhil and heroine Sree Leela attended as chief guests and launched the Big Ticket. At the event, Allu Aravind remarked, “We are set to release AAY on August 15 in the…

దర్శకుల సంఘానికి దర్శకుడు సుకుమార్ 5 లక్షల విరాళం

Creative Director Sukumar Donates 5 Lakhs to Directors' Association

సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు బి.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షులు బి.వీర శంకర్, కార్యదర్శి సి.హెచ్.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని ఆయన చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించింది అని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.