శాసనసభ చిత్రంతో కథానాయకుడి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రసేన. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని, శాసనసభ తరువాత మంచి ఆఫర్లు వరిస్తున్నాయని చెబుతున్న ఇంద్రసేన నటించిన తాజా చిత్రం ‘బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్’. ప్రముఖ దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్.రమేష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రసేనతో జరిపిన ఇంటర్వూ ఇది…
శాసనసభ తరువాత ఇంత గ్యాప్ తీసుకున్నారెందుకని?
శాసన సభ చిత్రం నటుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ బాధ్యతగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.శాసనసభ సినిమా కంటే ముందే ఓకే చేసిన సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్. ఈ చిత్రం కూడా నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకం వుంది.
ఇది ఎలాంటి కథ ?
నేడు సమాజంలో జరుగుతున్న మోసాలు, బ్లాక్‌మెయిల్ చుట్టు అల్లుకున్న కథ ఇది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ లో ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తో వుంటుంది. ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. అంతేకాదు పతాక సన్నివేశాల్లోమంచి సందేశం వుంటుంది.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది?
శాసనసభలో నా పాత్ర పూర్తి సీరియస్ లుక్‌లో వుంటుంది. కానీ ఈ చిత్రంలో నా పాత్ర అందుకు పూర్తి విరుద్దంగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. నా బాడీలాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్ సెట్ అయ్యే పాత్ర నాది. నటుడిగా మంచి స్కోప్ వున్న పాత్రం, నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా ప్రారంభంలో నెగెటివ్ షేడ్స్‌తో మొదలయ్యే నా పాత్ర చివరిలో తప్పు తెలుసుకుని రియలైజ్ అవుతాడు. తప్పకుండా నా పాత్ర అందరికి నచ్చుతుంది.
రవిచావలి లాంటి సీనియర్ దర్శకుడి దర్శకత్వంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
రవిచావలి దర్శకత్వంలో నేను ఇంతకు ముందు సూపర్ స్కెచ్ సినిమాలో నటించాను. ఈ సినిమా కథకు నేను సరిపోతానని నన్ను తీసుకున్నారు. ఆయన లాంటి ప్రతిభ గల దర్శకుడి దర్శకత్వంలో నటించే అవకాశం అందరికి రాదు. ఈ విషయంలో నేను హ్యపీగా ఫీలవుతున్నాను.
ఈ చిత్రంలో కొత్తదనం ఏమిటి?
ఈ చిత్రానికి దర్శకుడు రాసుకున్న కథే బలం. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేసినిమా ఇది. విజయ్.సి.కుమార్ కెమెరా గొప్పతనం, భోలే షావలి పాటలు, మార్తండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు బలాలు.
విలన్‌గా నటిస్తారా?
శాసన సభ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. నా పాత్ర.. కథ నచ్చితే విలన్‌గా నటించాడానికి కూడా రెడీగా వున్నాను.
మీ తదుపరి చిత్రాలు?
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న చిత్రంలో నెగిటివ్ రోల్ కనిపింబోతున్నాను. దీంతో పాటు నేను హీరోగా రెండు చిత్రాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.