Break Time in Bheemla Nayak Style

break Time in Bheemla Nayak Style
break Time in Bheemla Nayak Style
Spread the love

“యోగి కమండలం కొమ్ములోంచి
చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు
యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి
ప్రకృతికి వత్తాసు పలుకుతాడు
నాయకుడు ఈ రెండింటినీ
తన భుజాన మోసుకుంటూ
ముందుకు కదుల్తాడు…..!”

-షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ
చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు.
ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర